📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Minister Damodar – ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ కేర్ నిర్వహణలో మార్పులు

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష

హైదరాబాద్: ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్వాహణలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైన దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) అన్నారు. ఈ మూడు వ్యవస్థలతో పాటు, పేషెంట్లకు అందించే డైట్ విధానంలో తీసుకు రావాల్సిన మార్పులు, ఆయా వ్యవస్థలను బలో పేతం చేయడానికి కొత్త పాలసీల రూపకల్పనపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం జూబ్లీహిల్స్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వ హించారు.

శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, డైట్ పాలసీల్లో ఉన్న లోపాలను, ఆ లోపాల వల్ల ఎదురవుతున్న సమస్యలను డిఎంఇ డాక్టర్ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ మంత్రికి వివరించారు. సెక్యూరిటీ టెండర్ నిబంధనల్లో సరియైన నియమాలు
లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులుగా వృద్ధులను, ఫిజికల్ ఫిట్నెస్ లేని వారిని కాంట్రాక్టర్లు నియ మిస్తున్నారని.. ఈ అంశంలో మార్పు తీసుకురావాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఉద్యోగ విరమణ పొందిన వారిని నియమించాలని

సెక్యూరిటీ సిబ్బందిలో కొంత శాతం మేర ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారిని నియమించాలని, ఇందుకు అనుగుణంగా నిబంధనలు మార్చాలని అధికారులకు మంత్రి సూచించారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉండి, 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారినే నియమించుకునేలా టెండర్ కండీషన్ ఉండాలన్నారు. సెక్యూరిటీ సూపర్వైజర్ (Security Supervisor) పోస్ట్ ఉండాలని, ఈ పోస్టులో తప్పనిసరిగా రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఉండాలని మంత్రి ఆదేశించారు.

Minister Damodar

అన్ని హాస్పిటల్స్లో సీసీ టీవీ మానిటరింగ్ రూమ్ ఉండాలని, మానిటర్ చేసే పని కూడా సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఉండాలన్నారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది, పేషెంట్ల రక్షణ, నియంత్రణ, హాస్పిటళ్ల నిర్వాహణపై సెక్యూరిటీ గార్డులకు ట్రైనింగ్ ఇవ్వాలని మంత్రి సూచించారు. హాస్పిటళ్లు (Hospitals) పరిశుభ్రంగా ఉంచడంలో సానిటేషన్ సిబ్బందితో పాటు, సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కూడా ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ రద్దు చేసే విధంగా నూతన పాలసీ ఉండాలని

నిబంధనల ప్రకారం హాస్పిటళ్లు పరిశుభ్రంగా ఉంచకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసే విధంగా నూతన పాలసీ ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. పేషెంట్లకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే విధంగా నూతన పాలసీ ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. పేషెంట్ కేర్ వర్కర్లుగా క్వాలిఫైడ్ పర్సన్స్ (Qualified Persons) మాత్రమే ఉండాలని మంత్రి సూచించారు.

ఏఎన్ఎం, తదితర సూటబుల్ క్వాలిఫికేషన్లు ఉన్న వారికి అవకాశం ఇవ్వాలన్నారు. వారిలో కనీసం 60 శాతానికి తగ్గకుండా మహిళలు ఉండాలని మంత్రి సూచించారు. వర్కర్ల వేతనాల చెల్లింపులో కాంట్రాక్టర్ల అక్రమాలకు అవకాశం ఉండొద్దని, క్యాష్ పేమెంట్ సిస్టమ్ (Cash payment system) పూర్తిగా ఎత్తి వేయాలని మంత్రి ఆదేశించారు. వర్కర్ల ఈపీఎఫ్, ఈఎస్ఐఐ ఖాతా ల్లోకి నేరుగా డబ్బు జమ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. సమావేశంలో టీజీఎం ఎస్ ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, ఐపీఎం (ఫుడ్ సేఫ్టీ) డైరెక్టర్ డాక్టర్ శివలీల పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Government Hospitals Health Department Healthcare Workers hyderabad latest news Minister Damodar Rajanarsimha Patient Care Sanitation security Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.