📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Minister Bandi Sanjay: ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా నాటకాలు

Author Icon By Anusha
Updated: August 7, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకే న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుందే తప్ప బిసిల కోసం కానేకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay) అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ ను అమలు చేయాలనుకుంటుందని, బిసిలను ఘోరంగా మోసం చేస్తుందన్నారు. అందుకే కాంగ్రెసధర్నాకు బిసిల మద్దతు కరువైందన్నారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్లో బిసిలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని, తీరా చూస్తే బిసి బిల్లు పేరుతో అందులో 10% రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలను కుంటుందన్నారు.

ముస్లిం డిక్లరేషన్

మిగిలిన 32 శాతం జర్వేషన్లను మాత్రమే బిసిలకు ఇవ్వాలనుకుంటుందని, వాస్తవానికి మోడీ ప్రభుత్వం ఇప్పటికే బిసిలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన బిసి బిల్లువల్ల వారికి ఒరిగేది 5 శాతం,రిజర్వేషన్లు మాత్రమే అన్నారు. బిసి, బిల్లు ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు. సిద్ధమయ్యారని, అసలు ఇది బిసి డిక్లరేషన్ కానేకాదు అన్నారు. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ (Muslim Declaration) మాత్రమే అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ తూట్లు పొడిచిందన్నారు. బిసిలను వంచన చేస్తుందని, పక్కా ప్లాన్ ప్రకారమే తెలంగాణలో మెజారిటీ హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర చేస్తుందన్నారు. ఎందుకంటే ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసి హిందువులను మైనారిటీలుగా చేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతుందని మండిపడ్డారు.

Minister Bandi Sanjay:

తప్పనిసరిగా ఈ బిల్లును అడ్డుకుని తీరుతామన్నారు

ఈ విషయంలో మా లైన్ క్లియర్గా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మత రిజర్వేషన్లకు విరుద్ధమని, మొదటి నుండి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. ఇకనైనా బిసిలకే పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని, లేనిపక్షంలో తప్పనిసరిగా ఈ బిల్లును అడ్డుకుని తీరుతామన్నారు. ఇటాంటి విష వృక్షాన్ని తెలంగాణలో అడ్డుకోకపోతే ఈ విష వృక్షం దేశమంతా విస్తరించే ప్రమాదముందని, తక్షణమే ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్కు తగిన బుద్ది చెప్పి తీరుతామన్నారు. బిసి సామాజికవర్గంతోపాటు యావత్ హిందూ సమాజమంతా కాంగ్రెస్పై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

ప్రజలు మెదక్ నుండి ఇందిరాగాంధీని ఎంపిగా గెలిపించి

బిసిలపట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందే తప్ప చిత్తశుద్ధి లేనేలేదు. ఈ దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా బలహీనవర్గాల వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిందా? ఎమర్జెన్సీ అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను ఛీత్కరిస్తే తెలంగాణలోని దళిత, బడుగు, బలహీనవర్గాల ప్రజలు మెదక్ నుండి ఇందిరాగాంధీని ఎంపిగా గెలిపించి ఆమెకు రాజకీయ పునర్జన్మ ప్రసాదిస్తే గెలిచాక కూడా బిసిలకు ప్రధాని, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా ఆ వర్గాల ప్రజలను అవమానించిన చరిత్ర కాంగ్రెసే. 1989లో దేశమంతా కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైతే ఉమ్మడి ఏపి నుండి కాంగ్రెస్కు 39 స్థానాలను తెలుగు ప్రజలు అందించారు. అట్లాగే 2004, 2009లోనూ కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో ఎంపిలను అందించిన తెలుగు ప్రజలను వంచించిన చరిత్ర కాంగ్రెస్ తో అన్నారు.

బండి సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?

బండి సంజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ (BJP) లో ఉన్నారు.

బండి సంజయ్ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది?

ఆయన రాజకీయ జీవితం ఆరంభంలో ABVP (అఖిల భారత విద్యార్థి పరిషత్) ద్వారా ప్రారంభమైంది. తర్వాత బీజేపీ లో చేరి ఎమ్మెల్యే, తర్వాత ఎంపీగా ఎదిగారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ts-huge-response-to-rajivs-swagruha-plots-rs-100-crore-revenue-for-the-government/telangana/527423/

Bandi Sanjay statement BC declaration controversy Breaking News Congress Muslim reservation Hyderabad News Kamareddy manifesto latest news Muslim declaration Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.