రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతలో భాగంగా, డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ఈ సదస్సుకు పరిశ్రమల అధినేతలు హాజరుకావాలని ఆయన కోరారు.
Read Also: Grama Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకే ఓటేయండి – రేవంత్
బీటీ గోల్ఫ్ ఈవెంట్‌లో మంత్రి అజారుద్దీన్
సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీటీ గోల్ఫ్ హైదరాబాద్ 2025-26 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా అజారుద్దీన్ (Minister Azharuddin) మాట్లాడుతూ.. బీటీ గోల్ఫ్ ఈవెంట్ ప్రతిభ, స్నేహభావం, వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి ఒక అద్భుతమైన వేదిక అని ప్రశంసించారు.
టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్‌ను (Global Summit) నిర్వహిస్తున్నామని అజారుద్దీన్ వివరించారు. ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: