హైదరాబాద్: సింగరేణిలో టర్మినేట్ అయిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ (Mining engineers) ట్రైనీ ఉద్యోగులు పునర్నియామకం కానున్నారు. ఇందుకు సింగరేణి యాజమాన్యం (Singareni Management) అంగీకారం తెలిపింది. ఈ మేరకు దీనికి సంబంధించి హైదరాబాద్ లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు సమక్షంలో శుక్రవారం గుర్తింపు కార్మిక సంఘానికి, సింగరేణి యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిరింది.
గతంలో కొంత మంది ఇంజనీర్లను యాజమ్యానం తొలగించింది
గతంలో జూనియర్ ఐనింగ్ ఇంజినీరులు విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల వారిని సింగరేణి (Singareni) యాజమ్యానం విధుల నుంచి తొలగించింది. కాగా వీరిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని (To be rehired) సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం యజామాన్యానికి విజప్తి చేసింది. దీనిపై గత జూన్ 27వ తేదీన డైరెక్టర్ స్థాయిలో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలో చర్చించి ఒక ద్వైపాక్షి క అంగీకారానికి రావడం జరిగింది. తదుపరి యూనియన్ ప్రతినిధులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోమారు చర్చల అనంతరం త్రైపాక్షి ఒప్పందానికి అంగీకరించడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం టర్మినేట్ అయి పునర్నియామకం పొందుతున్న 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ (Mining engineers) ట్రైనీలను తాజా నియామకంగా గుర్తించడం జరుగుతుంది. వీరంతా హై పవర్ కమిటీ ముందుకు వెళ్లి తమ సర్వీసు విషయాలు, ఓవర్ మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు మొదలైనవి సమర్పించవలసి ఉంటుంది. అనంతరం ఆ కమిటీ సూచన మేరకు మెడికల్ ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ప్రాథమిక అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరిన వీరు తమ మొదటి సంవత్సరంలో తప్పనిసరిగా కనీసం 190 మస్టర్లకు తగ్గకుండా విధులు నిర్వహించాలని ఉంటుందని ఒప్పందంలో ప్రతిపాదించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: CH. Vidyasagar Rao: ప్రాథమికస్థాయి వరకు తెలుగుభాషలో బోధన అవసరం: విద్యాసాగరరావు