📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Mini Warehouses: రాష్ట్రవ్యాప్తంగా మినీగోదాముల నిర్మాణం

Author Icon By Ramya
Updated: June 28, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad: ప్రభుత్వం మహిళా సంఘాలు, రైతుల కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది! పంట చేతికి వచ్చినా సరైన ధర కోసం ఎదురు చూసే అన్నదాతల కోసం రాష్ట్రవ్యాప్తంగా మినీ గోదాములు నిర్మించనుంది. ఒక్కో గోదాము నిర్మాణానికి (Mini Warehouses) రూ.15 లక్షలు కేటాయిస్తూ, నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు (Women’s Groups) అప్పగించనుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్.. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మహిళలు, అన్నదాతల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసకుంటుంది. ఇప్పటికే మహిళా సంఘాల (women’s groups) కోసం రూ. 10 లక్షల బీమా, వారి చేత పెట్రోల్ బంకులు తెరిపించడం వంటి నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఇప్పుడు వారికి మరో శుభవార్త చెప్పెందుకు సిద్ధమైంది. మహిళా సంఘాలకు, అన్నదాతలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మహిళాసంఘాలకు రూ.15 లక్షల లబ్ది కలిగించేందుకు ముందుకు వచ్చింది. మంచి ధరవచ్చే వరకు అగి అమ్ముకుందామనుకునే అన్నదాతలకు గోదాముల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోదాములు నిర్మించడానికి చర్యలు ప్రారంభించింది.

రాష్ట్రవ్యాప్తంగా మినీ గోదాముల (Mini Warehouses) నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభం – నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు!

సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్చ్) ఆధ్వర్యంలో వీటి నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. అంతేకాకుండా గోదాముల నిర్వహణ బాధ్యతలను మహిళా రైతు సంఘాలు, మండల సమాఖ్యలకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో గోడౌన్ల నిర్మాణం కోసం అనువైన ప్రాంతాల ఎంపిక ప్రక్రి యను ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో భూములు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో గోదాములో ఎన్ని క్వింటాళ్ల ధాన్యం నిల్వచేయవచ్చు అనే దానిపై నాబ్ కిసాన్ సంస్థ.. అంచనాలు రెడీ చేస్తుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటంతో అధికారులు దీనిపై చర్యలు వేగవంతం చేశారు. ఈ గోదాములు అందుబాటులోకి వస్తే.. రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడమే కాక.. వారి ఆశించిన ధరలు వచ్చినప్పుడు పంటలను అమ్ముకోవచ్చు. ఈ గోదాముల నిర్మాణం, నిర్వహణను సెర్చ్ పర్యవేక్షించనున్నది. అలానే వీటి నిర్వ హణపై మహిళా సంఘాలకు (women’s groups), సమాఖ్యలకు శిక్షణ అందించనుంది. మినీగోదాముల నిర్మాణానికి స్థలాలు గుర్తించిన మండలాల్లో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు గోదాముల నిర్వహణ, బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర చరిత్రలో ఇది ప్రథమం. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో మినీ గోదాముల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read also: Distribution of Ration Rice : 3 నెలల రేషన్.. ఎల్లుండితో ముగియనున్న గడువు

#AgricultureInfrastructure #AgricultureSupport #CropStorage #EmpoweringWomen #FarmerSupport #FarmersWelfare #MiniGodowns #MiniWarehouses #NABKisan #RevantReddy #RuralEmpowerment #RythuWelfare #selfhelpgroups #SERPInitiative #StorageInfrastructure #TelanganaGovernment #TelanganaSchemes #TSDevelopment #TSFarmers #TSNews #TSWelfare #WarehouseScheme #WomenEmpowerment #WomenGroups #WomenLedDevelopment Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.