midazolam injection: హైదరాబాద్ : ఆపరేషన్ల సమయంలో వైద్యుల సూచనల మేరకు రోగులకు పరిమిత మోతాదులో ఇవ్వాల్సిన మైడాజోలం, అమ్నేషియా వంటి మత్తు ఇంజక్షన్లు (Anesthetic injections) నిర్మల్ పట్టణంలో నలుగురు యువకులు డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారికి అమ్ముతున్న వైనం వెలుగు చూసింది. నిర్మల్ జిల్లాలో గంజాయి సహా పలు రకాల మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ వ్యక్తులు ఇప్పుడు కొత్తరకం మత్తులకు అలవాటుపడుతున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ల సమయంలో రోగులకు పరిమిత మోతాదులో వచ్చే మైడాజోలం, అమ్నేషియా వంటి మత్తు ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులతోపాటు మెడికల్ షాపులలో పనిచేసే కొందరి దగ్గర తీసుకుంటుండడం పోలీసులకు షాక్ కు గురిచేస్తోంది. మైడాజోలం, అమ్నేషియా వంటి మత్తు ఇంజక్షన్లు ఒక వయల్లో ఐదు మిల్లీ లీటర్ల వరకు వుంటుంది. దీనిని రోగుల దేహదారుడ్యాన్ని బట్టి ఆపరేషన్ను బట్టి వైద్యులు ఒక మిల్లీ లీటర్ నుంచి అంతకు పైగా ఇస్తుంటారు. ఈ ఇంజక్షన్లను నలుగురు యువకులు ప్రైవేటు ఆసుపత్రుల, మెడికల్ షాపుల నుంచి వైద్యుల సిఫార్సు లేకుండానే అక్రమంగా సేకరించసాగారు.
మైడాజోలం ఇంజక్షన్లు డ్రగ్స్ బానిసలకు విక్రయం
midazolam injection: ఒక్కో వయాల్ నుంచి ఒక మిల్లీ లీటర్ చొప్పున ఐదు ఇంజక్షన్లుగా మార్చి డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారికి ఒక్కో ఇంజక్షన్ను ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అవసరాన్నిబట్టి ఈ ఇంజక్షన్ ను డ్రగ్స్ బానిసలకు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది (Hospital staff) వారి ఇళ్లు లేదా ప్రైవేటు స్థలాల్లో ఇస్తున్నారు. రెండున్నర నెలల క్రితం ఓ వ్యక్తి ఇలాంటి మత్తు ఇంజక్షన్ అక్రమంగా తాజాగా నలుగురు విక్రయిస్తూ దొరికిపోగా యువకులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ నలుగురు యువకులు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఈ గోల్మాల్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఈ మత్తుఇంజక్షన్ను మెడికల్ షాప్లలో ఒక్కో వయల్ను రూ. 500లకు కొని డ్రగ్స్ బానిసలకు రూ. 2,500 నుంచి ఐదు వేల రూపాయలకు అమ్ముతున్నారు. మత్తు ఇంజక్షన్లను అక్రమంగా అమ్ముతూ పట్టుబడిన నలుగురు యువకులను నిర్మల్ పోలీసులు విచారిస్తున్నారు. వీరు ఎంతకాలంగా ఈ వ్యాపారం చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. వీరి వెనుక ఉన్నది ఎవరునే దాని పైనా ఆరా తీస్తున్నారు. ఇందులో ఏదైనా ఆసుపత్రి, మెడికల్ షాప్ పాత్ర ఉందా…? అనే దానిపైనా విచారిస్తున్నారు. ఈ ముఠా వలలో చిక్కుకున్న డ్రగ్స్ బానిసల వివరాలు సేకరిస్తున్నారు.
మత్తుమందు ఇంజెక్షన్లు మూడు రకాలు?
అనస్థీషియాలో మూడు రకాలు ఉన్నాయి: జనరల్, రీజినల్ మరియు లోకల్ . కొన్నిసార్లు, ఒక రోగికి ఒకటి కంటే ఎక్కువ రకాల అనస్థీషియా లభిస్తుంది.
అనస్థీషియా 4 రకాలు?
ఉప-నావిగేషన్. శస్త్రచికిత్స మరియు ఇతర ప్రక్రియల సమయంలో ఉపయోగించే అనస్థీషియాలో నాలుగు ప్రధాన వర్గాలు ఉన్నాయి: జనరల్ అనస్థీషియా, రీజినల్ అనస్థీషియా, సెడేషన్ (కొన్నిసార్లు “మానిటర్డ్ అనస్థీషియా కేర్” అని పిలుస్తారు), మరియు లోకల్ అనస్థీషియా . కొన్నిసార్లు రోగులు ఏ రకమైన అనస్థీషియాను ఉపయోగించాలో ఎంచుకోవచ్చు.
Read Hindi News : hindi.vaartha.com
Read also: New Primary Schools: రాష్ట్రంలో కొత్త కాలనీల్లో41 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం