📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు

MGNREGA: చట్టాన్ని మార్చడమంటే పేదల పొట్టకొట్టడమే: మీనాక్షి

Author Icon By Siva Prasad
Updated: January 28, 2026 • 9:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

MGNREGA: యూపిఏ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడం కోసం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధిహమి చట్టాన్ని మార్చడమంటే పేదల పొట్టకొట్టడమే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ విమర్శించారు.మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం ప్రధాని మోడీ కి తగదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.బుధవారం చిన్న శంకరంపేట మండలం కోర్వి పల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొనగా, ముఖ్య అతిధిగా హాజరై ఆమె మాట్లాడుతూ 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్రంలో ప్రవేశపెట్టిందని తెలిపారు.

Read Also: Jagan : ప్రభుత్వ ఆదాయం అంత కూటమి జేబుల్లోకి – జగన్

ఉపాధి హామీ చట్టం పేరుమార్పుపై నిరసన

పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉపాధి హామీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని బిజెపి కేంద్ర ప్రభుత్వం మోడీ పేరును మార్చడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.పేదలకు ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశ్యం తో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపిఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని కల్పిస్తే దానిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆమె విమర్శించారు.
వీబీ-జీరామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మ, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

MGNREGA: Changing the law is a betrayal of the poor: Meenakshi

గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం చట్టం తేవడం దుర్మార్గమన్నారు. ఈ చట్టం తేవడం మూలంగా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. పేదలు, రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం విధానం ఉన్నదని అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీరామ్ జీ)గా మార్చే బిల్లును ఆమె తప్పుబట్టారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడంలాంటి గొప్ప లక్ష్యాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. గతంలో వందశాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40శాతం భారాన్ని రాష్ట్రా లపైమోపడం అన్యాయమన్నారు.

ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్రప్రభావం చూపే నిర్ణయమని, కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 30 కోట్ల మందికి పైగా పేదలకు ఉపాధి కల్పిస్తున్న చట్టాన్ని నీరుగార్చటం తగదని పేర్కొన్నారు. పనిదినాలను పెంచామని చెబుతూ కూలీల సంఖ్య పెద్ద ఎత్తున కుదించడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పుడున్న చట్టంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు విడుదల చేస్తున్నాయని తెలిపారు. అయితే, ప్రస్తుత బిల్లులో కేంద్రం ఇచ్చే నిధుల్ని 60 శాతానికి కుదించడం, 40 శాతం నిధులను రాష్ట్రాలే భరించాలని పేర్కొనటం దారుణమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అతి జోక్యంతో ఇప్పటికే నిధుల లేమితో అల్లాడుతున్న చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఎత్తేసే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులను ఆపటం వల్ల కూలీలు పనికోల్పోయే అవకాశం ఉంటుందని ఎత్తిచూపారు. చట్టానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తొలగించి ఇప్పుడు వికసిత..భారత్ గ్యారంటీ ఫర్ రోజ్లరీ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్(విబి జి రాంజీ)గా మార్చడాన్ని తప్పుబట్టారు. ఉపాధి హామీ పని దినాలను 200కి పెంచాలనీ, రోజుకూలిని రూ.307 నుంచి రూ.600 వరకు పెంచడంతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

MGNREGA: Changing the law is a betrayal of the poor: Meenakshi

కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆమెకు ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ ఘన స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షులు వి. హనుమంతరావు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి ప్రతినిధి అనిల్, పీసీసీ ప్రతినిధి ముబాకర్ అలీ ఖాన్, దండాలయ్య చైర్మన్ సుహాసిని, దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల పురం జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సర్పంచుల పూర్వం మండల అధ్యక్షుడు అలావత్ మోహన్ నాయక్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, సర్పంచ్ పుల్లారావు తోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BJP vs Congress Congress protest Employment Guarantee Scheme Meenakshi Natarajan MGNREGA MGNREGA protest Modi government Rural Employment Rural India news Telangana Congress VB ZRG

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.