📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Metro: మెట్రో పనులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Author Icon By Sharanya
Updated: June 13, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న మెట్రో (Metro) రైలు రెండో దశ ప్రాజెక్టుకు తాత్కాలిక ఆటంకం ఎదురైంది. చార్మినార్, ఫలక్‌నుమా వంటి వారసత్వ కట్టడాల సమీపంలో పనులు చేపట్టవద్దని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

వారసత్వ కట్టడాల పరిరక్షణపై అధ్యయనం లేకుండా, వాటి సమీపంలో మెట్రో కారిడార్​-6 పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ యాక్ట్​ పబ్లిక్​ వెల్ఫేర్​ ఫౌండేషన్ ​(ఏపీడబ్ల్యూఎఫ్​) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

Metro: మెట్రో పనులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వానికి గడువు మంజూరు

ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సుజయ్​పాల్​, జస్టిస్​ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మెట్రో పనుల కారణంగా చార్మినార్​, ఫలక్​నుమాతో పాటు పలు నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం, కేంద్ర పురావస్తు శాఖ చట్టం నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నాకే పనులు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున కౌంటర్​ దాఖలు చేయడానికి మూడు వారాల గడువు కావాలని అదనపు అడ్వొకేట్​ జనరల్​ మహమ్మద్​ ఇమ్రాజ్​ఖాన్​ కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.

రూ. 19 వేల కోట్ల మెట్రో రెండో దశ ప్రాజెక్టు

హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును దాదాపు రూ. 19 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదించారు. 3 మార్గాల్లో 86.5 కి.మీ. ప్రతిపాదించారు. జేబీఎస్​-శామీర్​పేట; జేబీఎస్‌-మేడ్చల్‌; శంషాబాద్‌ విమానాశ్రయం-ఫ్యూచర్‌సిటీ మార్గాలను ఇందులో చేర్చారు.

హెచ్‌ఏఎంఎల్‌ నుంచి ప్రాజెక్ట్ నివేదిక సమర్పణ

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను హెచ్‌ఏఎంఎల్ (Hyderabad Airport Metro Limited) బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

Read also: Mal Reddy: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ : ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

Thunder Bolt: పిడుగుపాటుకు ఆరుగురు వ్యవసాయ కార్మికుల మృతి

#Charminar #Falaknuma #HeritageProtection #HighCourtOrders #HyderabadMetro #MetroPhase2 Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.