ప్రపంచ స్థాయి ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ (HYD) నగరాన్ని ఇకపై.. ‘నెట్-జీరో సిటీ’గా మార్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ (HYD) ను దక్షిణ ఆసియాలోనే ‘నైట్ టైమ్ క్యాపిటల్’గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీసీ, మెట్రో రైలు వంటి వాటిని అర్థరాత్రి 2 గంటల వరకు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.
Read Also: Secunderabad: సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
టైగర్ రిజర్వ్ జోన్లలోనూ రిసార్టులు రానున్నాయి
దీనిలో భాగంగా మాదాపూర్, ట్యాంక్‌బండ్, ఓల్డ్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, విమానాశ్రయ ప్రాంతాలను నైట్ జోన్లుగా మార్చనున్నారు. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు వయా ట్యాంక్ బండ్ మీదుగా.. ‘ హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్’ పేరుతో రాత్రి పూట నిర్వహించే బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అలానే తెలంగాణవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించారు.
పర్యాటకుల సౌకర్యార్థం.. హోటల్ బుకింగ్స్, టికెట్లు, ప్రయాణం అన్నీ ఒకే కార్డుతో జరిగేలా ‘తెలంగాణ పాస్’ (యూనిఫైడ్ డిజిటల్ పాస్) తీసుకురానున్నారు.వీటితో పాటు ఆకాశం నుంచి సోమశిల, రామప్ప, నాగార్జునసాగర్, కాళేశ్వరం అందాలను చూసేందుకు హెలికాప్టర్ రూట్లను ఏర్పాటు చేయనున్నారు. భువనగిరిని.. ‘రాక్ క్లైంబింగ్ డెస్టినేషన్’గా.. అమ్రాబాద్, కవ్వాల్ అడవుల్లో ఎకో ట్రయల్స్ ఏర్పాటు చేస్తారు. టైగర్ రిజర్వ్ జోన్లలోనూ రిసార్టులు రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: