హైదరాబాద్ క్రీడాభిమానులకు భారీ సర్‌ప్రైజ్ సిద్ధమవుతోంది. ప్రపంచ ఫుట్‌బాల్ మేధావి లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఈ ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌కు రావచ్చనే సమాచారం వెలువడుతోంది. “గోట్ ఇండియా టూర్ 2025”లో భాగంగా నగరంలో ఒక ప్రత్యేక స్నేహపూర్వక మ్యాచ్ నిర్వహించే అవకాశముందని, ఆ మ్యాచ్‌లోనే సీఎం ఎ. రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి మైదానంలో అడుగుపెట్టవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్ సంకేతాలిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్‌పై ఉన్న ఇష్టం, క్రీడల ప్రోత్సాహంపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ప్రచారాన్ని మరింతగా ఆసక్తికరంగా మార్చాయి.
Read also: BREAKING NEWS: సౌదీ రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం
Messi: Messi, the legend of Hyderabad.. Match with CM Revanth Reddy!
అథ్లెట్లకు అధునాతన వసతులు
రాష్ట్రాన్ని క్రీడా కార్యకలాపాలకు కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. సరూర్‌నగర్‌లో జరిగిన కరాటే ఫెడరేషన్ ఆఫ్ షోటోకాన్ ఇండియా ప్రెసిడెంట్స్ కప్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అథ్లెట్లకు అధునాతన వసతులు, మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందుతున్నాయని, గచ్చిబౌలిలో జరిగిన ఎన్ఎస్ఎన్ కరాటే లీగ్ 2025 కార్యక్రమంలో కూడా ఈ విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: