📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Mee Seva: ప్రజలకు మరిన్ని సేవలతో మీ సేవ అందుబాటు

Author Icon By Sharanya
Updated: July 1, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ పరిపాలనలో మరో కీలక అడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా అందించేందుకు రూపొందించిన మీ సేవ (Mee Seva) సేవలు ఇప్పుడు మరింత విస్తరించబడ్డాయి. తాజాగా, వివాహ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్‌ విలువ సర్టిఫికెట్ వంటి ముఖ్యమైన సేవలను కూడా మీ సేవ ద్వారా పొందే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ, నిర్మాణ రంగానికి చెందిన వ్యాపారవేత్తలకూ ఎంతో ప్రయోజనకరం. మీ-సేవ లేదా ఆన్‌లైన్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా, గ్రామ వివరాలను సమర్పించి ఏదైనా భూమికి సంబంధించిన తాజా మార్కెట్‌ విలువను సులభంగా పొందవచ్చు. ఈ అప్లికేషన్​లను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం 24 గంటల్లో పరిశీలిస్తుంది.

మీ సేవ అందుబాటు ద్వారా లభించే తాజా సేవలు:

2025 జూన్ 30న ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించిన తాజా సేవలతో నిర్మాణ రంగం, స్థిరాస్తి వ్యాపారులకు ఈ సదుపాయం ఎక్కువగా ఉపయోగపడనుంది. వివాహ ఫొటోలు, చిరునామా, వయసు ధ్రువీకరణ సంబంధిత పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే సబ్‌-రిజిస్ట్రార్‌ ఆఫీసు (ఎస్‌ఆర్‌ఓ) నుంచి వివాహ ధృవీకరణ సర్టిఫికెట్‌ను నేరుగా జారీ చేస్తారు.

డిజిటల్ పాలనలో ముందడుగు:

ఈ సేవల విస్తరణతో డిజిటల్‌ గవర్నెన్స్‌లో ఇదొక కీలక అడుగని, ఇప్పటికే మీ-సేవలో ఆర్‌టీఏ, ఇసుక బుకింగ్‌, పాన్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టీ-ఫైబర్, అదనపు కియోస్కీలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. 150 కి పైగా ప్రభుత్వ సేవలను ఇప్పటికే అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే అందుబాటులో ఉన్న మీ సేవల లిస్ట్:

  1. పేరు మార్పిడి సర్టిఫికేట్లు
  2. కుల, ఆదాయం ధృవీకరణ
  3. స్టడీ గ్యాప్ సర్టిఫికేట్
  4. మైనారిటీ ధృవీకరణ పత్రాలు
  5. ఆధార్ సంబంధిత సేవలు
  6. క్రీమీలేయర్/నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్లు
  7. రెసిడెన్సీ/లోకల్ క్యాండిడేట్ ధృవీకరణ
  8. ఖాస్రా, పహాణీ సర్టిఫికేట్లు
  9. జనన/మరణ ధృవీకరణ పత్రాలు
  10. విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపులు
  11. ఆస్తి పన్ను చెల్లింపు
  12. లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్
  13. ఇసుక బుకింగ్
  14. పాన్ కార్డు అప్లికేషన్
  15. RTA సేవలు

Read also: Sigachi Blast: ఆశలన్నీ కన్నీరయ్యే..ప్రమాదంలో మృతి చెందిన దంపతులు

#DigitalIndia #eGovernance #MarketValue #MarriageCertificate #MeeSeva #OnlineServices #PublicServices #TelanganaGovernment Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.