Video call suicide case : మేడిపల్లి విషాదం వీడియో కాల్‌లో మాట్లాడుతూనే యువకుడి మృతి

Read Time:  1 min
Software engineer suicide
Software engineer suicide
FONT SIZE
GET APP

Video call suicide case : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే 17 ఏళ్ల బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోడుప్పల్ అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో నివసించే ఓ ప్రైవేట్ ఉద్యోగి కుమారుడు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. ప్రస్తుతం మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 5వ తేదీ రాత్రి తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Video call suicide case
Video call suicide case

వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలోనే అతడు చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గమనించిన ఆ యువతి తీవ్ర ఆందోళనకు గురై వెంటనే బాలుడి స్నేహితులకు సమాచారం ఇచ్చింది. వారు హుటాహుటిన ఇంటికి చేరుకుని అతడిని ఉరినుంచి దించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.