హైదరాబాద్ : ఎల్లంపల్లి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించకుండా కెసిఆర్ నిర్లక్ష్యం చేశారని కాళేశ్వరం ప్రారంభత్సో వానికి మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులను తీసుకొచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సిఎల్పి మీడియా సెంటర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే నిర్మించామన్నట్లగా హరీష్ రావు తెగ ఊదరగొడుతున్నాడని ఎల్లంపల్లి(Ellampally)కి బిఆర్ఎస్కు ఏం సంబంధం? ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లికి శంకుస్థాపన
2004 జూలై28 అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లికి శంకుస్థాపన చేశారని, నిర్మాణం పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చరిత్రను వివరించారు. ఎల్లంపల్లిని ప్రారంభిస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందన్న భయంతో ఇప్పటి వరకు అధికారికంగా ప్రారంభోత్సం లేకుండా చేశారని ఆవేదన చెం దారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లంపల్లితో ఏలాం టి సంబంధం లేదని ఆయన తెలిపారు. ప్రాణహిత చేవేళ్ల ను రద్దు చేసి కెసిఆర్ కాళేశ్వరం తీసుకువచ్చాడని అన్నారు.. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం (Kaleswaram)నిర్మిస్తే బ్యారేజీలు పనికి రాకుండా పోయాయని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన రిజర్వాయర్లు, కాలువలను కూడా ఉపయోగించుకోవద్దని హరీష్ రావు అంటున్నాడని ఆరోపించారు. మల్లన్న సాగర్ 50 టిఎంసిల సామర్థంతో నిర్మించడం వల్లే గోదావరి జలాలు ఫేజ్ 2 ను మల్లన్న సాగర్ నుంచి తీసు కుంటున్నామని ఆయన అన్నారు. కాళేశ్వరం నిర్మించింది తమరే, కూల్చింది కూడా తమరే ఈ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు నువ్వు కాళేశ్వరరావు కాదు నువ్వు కరప్షన్ రావు, కలెక్షన్ రావు అని కవితనే సర్టిఫికెట్ ఇచ్చిందని ఆయన అన్నారు. అయినా సిగ్గులేకుండా మీడియా ముం దుకు వచ్చి మాట్లాడుతున్నావు.. కరప్షన్ రావు ముందు కవితారావు అడిగిన ప్రశ్నలకు ప్రెస్ మీట్ ప్రెస్మీట్ పెట్టి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కవిత చెప్పింది అబద్దమైతే ఆమె పైన పరువు నష్టందావా వేయ్యాలని సూచించారు. హరీష్ రావు కాళేశ్వరం కహానీలను సిబిఐ త్వరలోనే తేల్చుతుందని, దోచుకుతినే బుద్ది ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి లేదని ఆయన అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: