📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Latest News: Medicover Hospitals – మెడికవర్ హాస్పిటల్స్ – సికింద్రాబాద్‌లో 300 పడకల ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2025: యూరప్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులలో ఒకటి గా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ అత్యంత గౌరవనీయమైన హెల్త్‌కేర్ బ్రాండ్ గా గుర్తింపు పొందటంతో పాటుగా హాస్పిటల్స్ తో భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్ గా గుర్తింపు పొందిన మెడికవర్ హాస్పిటల్స్ (Medicover Hospitals) ఇప్పుడు నగర వాసుల కోసం తమ 24 వ హాస్పిటల్ 300 పడకల వైద్య సేవలను సికింద్రాబాద్ కి విస్తరించింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర బొగ్గు గనుల శాఖామాత్యులు
శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) గారు, తెలంగాణ ఆరోగ్యశాఖ & కుటుంబ సంక్షేమ & సైన్స్ & టెక్నాలజీ శ్రీ దామోదర రాజనరసింహ గారు, శ్రీ పోన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు,సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ టి. పద్మారావు గారు, కార్పొరేటర్లు శ్రీమతి కూర్మ హేమలత గారు, శ్రీమతి కొంతం దీపికా గారు, శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ గారు పాల్గొన్నారు.


???? శ్రీ జి. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ “ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో, మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌ (Secunderabad) లో తమ 24 వ నూతన ఆస్పత్రిని ప్రారంభించడం చాల అభినందనీయం.ప్రజలందరికీ ప్రాథమిక వైద్యం నుంచి అత్యాధునిక చికిత్సల వరకు సమానంగా అందించాలని అన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ యొక్క ముల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్య బృందం కలిగిన ఈ హాస్పిటల్ రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని అన్నారు.

???? శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ “సాధారణ ప్రజలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్స పొందగలిగే అవకాశం కల్పించడం ఎంతో గొప్ప విషయం. మెడికవర్ వైద్యులు (Medicare physicians) సేవా దృక్పథంతో పని చేసి, సమాజంలో విశ్వాసాన్ని పెంచుతారని నాకు నమ్మకం ఉంది అని అన్నారు

Medicover Hospitals

???? శ్రీ దామోదర రాజనరసింహ (Damodar Raja Narasimha) గారు మాట్లాడుతూ “ఆరోగ్యరంగం అభివృద్ధి చెందితేనే ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. ఈ సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి అధునాతన వైద్యసదుపాయాలతో రోగులకు అండగా నిలుస్తుంది. తెలంగాణ ఆరోగ్యరంగానికి ఇది మరొక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు.

???? శ్రీ పోన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గారు మాట్లాడుతూ “ప్రజలకు చేరువలో ఉండే ఆసుపత్రులు మాత్రమే నిజమైన ప్రజాసేవ చేస్తాయి. మెడికవర్ ఈ కొత్త భవనం ద్వారా నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి సిద్ధంగా ఉండటం అభినందనీయం. ఇది రోగులలో విశ్వాసం కలిగించే కేంద్రంగా నిలుస్తుంది అని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ గారు మాట్లాడుతూ భారత దేశంలో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ (Multinational Hospital) చైన్ గా ప్రస్తుతం 24 హాస్పిటల్స్ ని మేము ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రతి సంవత్సరం లక్షలాదిమందికి ఖచ్చితమైన వైద్య సేవలను అందిస్తున్నాము. రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించే మెడికవర్ హాస్పిటల్స్ అందుబాటు ధరల్లో ఖచ్చితమైన చికిత్సను అందించటంలో దేశవ్యాప్తంగా తన ప్రత్యేకతను నిలుపుకుంది.

అత్యాధునిక సాంకేతికత తో అత్యున్నత నైపుణ్యం మిళితం చేసి ఇక్కడ అందించే వైద్య సేవలు ఎంతోమందికి నూతన జీవితాన్ని అందిస్తాయి. అత్యంత నిష్ణాతులైన 40 మందికి పైగా డాక్టర్ల తో పాటుగా ప్రపంచస్థాయి సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అని అన్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,తెలంగాణా తో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక లలో కూడా మెడికవర్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాం” అని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/job-mela-mega-job-mela-at-the-collectorate-in-kamareddy-district/more/career/548464/

24th hospital 300-bed hospital Breaking News Breaking News in Telugu healthcare expansion Hyderabad Hospital India healthcare chain latest news Medicover Hospitals Secunderabad medical services Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.