Medchal Crime: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

Read Time:  1 min
Medchal Crime: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు
FONT SIZE
GET APP

Medchal Crime: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగేష్‌తో పాటు గాంధీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సందీప్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Read Also: Iran Attack: ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

Medchal Crime: Home guard caught by ACB while taking bribe
Medchal Crime: Home guard caught by ACB while taking bribe

పోస్టుమార్టం రిపోర్ట్ కోసం రూ. 2 లక్షల డిమాండ్

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒక మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చేందుకు గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్, కీసర హోంగార్డు నాగేష్ కలిసి బాధితుడి వద్ద రూ. 2 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశారు. చివరకు అది లక్ష రూపాయలకు బేరం కుదిరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా అందాల్సిన రిపోర్ట్ కోసం ఇలా డబ్బులు అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.ఇవాళ కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బాధితుడి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.