📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medaram: మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

Author Icon By Saritha
Updated: February 7, 2026 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. అయితే, కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు తిరుగు ప్రయాణం చేసిన తర్వాత మేడారం (Medaram) పరిసరాలు భారీగా చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించి ప్రాంతాన్ని శుభ్రం చేయడం ప్రస్తుతం అధికార యంత్రాంగం మరియు పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది.

Read Also: Jeevan Rao: ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

With the conclusion of the grand festival, a huge amount of waste has accumulated.

వ్యర్థాల్లో 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాలు 

మేడారం(Medaram)పరిసర గ్రామాల్లో దాదాపు 3 వేల టన్నుల చెత్త(Garbage)పేరుకుపోయినట్లు అధికారులు అంచనా, జంతు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రపరిచే పనులను వేగవంతం చేస్తున్నారు.

ఈ శుభ్రతా పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారని, కానీ జంతు అవశేషాలు, కోళ్ల వ్యర్థాలతో కూడిన అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని వారు వేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి కృపతోనే ఈ పనిని భరిస్తున్నామని చెబుతూ భావోద్వేగానికి లోనవుతున్నారు. వ్యర్థాల్లో దాదాపు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Devotees garbage issue Latest News in Telugu medaram Sammakka Saralamma Jatara sanitation challenge Telugu News tribal festival

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.