📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Medaram Jatara: తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు

Author Icon By Saritha
Updated: January 31, 2026 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర (Medaram Jatara) జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. అయితే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌తో నరకయాతన అనుభవిస్తున్నారు.

Read Also: AP: మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

Traffic woes due to vehicles of devotees returning home.

నేటితో ముగియనున్న మహా జాతర

(Medaram Jatara) దర్శనం ముగించుకుని తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో మేడారం మార్గాలు నిండిపోయాయి. తాడ్వాయి–మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలతో పాటు ప్రైవేట్‌ వాహనాలు భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో పోలీసులు ప్రైవేట్‌ వాహనాలను పస్రా మీదుగా, ఆర్టీసీ, వీఐపీ వాహనాలను తాడ్వాయి మీదుగా మళ్లించారు.

అమ్మవార్ల గద్దెల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్ల నిర్వహణ సరిగా లేక వృద్ధులు, చిన్నారులు గందరగోళానికి గురయ్యారు. వీఐపీ పాస్‌లు ఉన్నవారికి సైతం దర్శనం దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తమైంది. విపరీత రద్దీ కారణంగా కొందరు భక్తులు దూరం నుంచే దర్శనం చేసుకుని వెనుదిరిగారు. శనివారం అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Devotees Problems Latest News in Telugu Medaram Jatara Sammakka Saralamma Jatara Telangana Kumbh Mela Telugu News traffic jam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.