📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Medaram Jatara: ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

Author Icon By Rajitha
Updated: January 18, 2026 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. జాతర సందర్భంగా నడపనున్న ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని ప్రకటించింది. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఈ స్పెషల్ సర్వీసుల్లోనూ టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ఆర్టీసీ స్పష్టం చేసింది. జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Read also: Ward Reservations: నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Free travel for women even on special buses

స్పెషల్ బస్సుల చార్జీలు ఖరారు

మేడారం జాతరకు సంబంధించి ప్రత్యేక బస్సుల టికెట్ ధరలను ఆర్టీసీ అధికారికంగా ఖరారు చేసింది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి మేడారానికి (Medaram) వెళ్లే బస్సులకు రూ.250 నుంచి రూ.500 వరకు ఛార్జీలు నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ నుంచి మేడారానికి ప్రయాణించే భక్తుల కోసం రూ.600 నుంచి రూ.1,110 వరకు టికెట్ ధరలు ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా మేడారానికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు

వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచి మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సులభంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతర తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

free travel for women latest news Medaram Jatara Special buses Telugu News tsrtc

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.