ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ మహాజాతర లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో అటు ఆర్టీసీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు మండిపడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో సహనం కోల్పోయిన భక్తులు అధికారులపై తిరుగుబాటు చేశారు.
Read Also: Amaravati: ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
హనుమకొండ, హైదరాబాద్ (Hyderabad) వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన (Medaram) భక్తులు వేల సంఖ్యలో బస్టాండ్‌లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు మార్గమధ్యంలోనే నిలిచిపోవడంతో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వేలాదిమందితో బస్టాండ్ కిక్కిరిసిపోగా, చంటి బిడ్డలతో ఉన్న తల్లులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భక్తులు ఆగ్రహంతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి, ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతర నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీగా తరలివచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అధికార యంత్రాంగం చేతులెత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: