📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Medak: భర్త మరణాన్ని తట్టుకోలేక కుమారుడితో సహా భార్య ఆత్మహత్య

Author Icon By Sushmitha
Updated: December 3, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లంటేనే కడదాకా కలిసి జీవించేందుకు చేసుకునే మధురమైన ఒప్పందం. కష్టమైనా సుఖమైనా ఇద్దరూ పంచుకుంటూ మనసులో మనసై ఆనందాల హరివిల్లులో విహరిస్తూ కేరింతలాడే సంసారనావలో ఉండే ఆనందమే వేరు కదా! కానీ అన్నీ జంటలు నిండివయసు వరకు జీవించలేరు. దేవుడు రాసిన విధిరాతకు  ప్రతి ఒక్కకరం తలవంచాల్సిందే. అనుకోని ఉపద్రవం కావచ్చు అనారోగ్యం కావచ్చు భాగస్వామిలో ఒకరు చనిపోవచ్చు. కానీ అంతమాత్రాన జీవితమే శూన్యమనుకోకుండా ఆ భాగస్వామి జ్ఞాపకాలతో జీవించడం నేర్చుకోవాలి. అలాగని ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు.

Read Also: Telangana: తెలంగాణ సమిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించిన రేవంత్

గుండెబరువుతో తన తోడులేని పరితపిస్తూ, మరణాపేక్షతో ఉంటారు. చివరికి తనువు చాలిస్తారు. సరిగ్గా ఓ వివాహత ఇదే నిర్ణయం తీసుకుంది. భర్త లేని జీవితం వ్యర్థమనుకుని, కుమారుడితో బలవన్మరణానికి పాల్పడింది.

Medak Unable to bear the death of her husband, a wife and her son committed suicide

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనారోగ్యంతో మరణించిన భర్త కడదాకా కలిసి ఉంటాడనుకున్న భర్త అర్థాంతరంగా చనిపోయాడు. చిన్నవయసు కావడంతో మరో పెళ్లి చేసుకొని, కొత్త జీవితం ప్రారంభించమని అత్తామామలు హితవు పలికారు. కానీ భర్త తోడు లేని జీవితం నాకొద్దనుకున్న ఆ వివాహిత రెండేళ్ల కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మెదక్ (Medak) జిలాకల చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ లో చోటు చేసుకుంది. ఎస్ ఐ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజాపూర్ కు చెందిన ప్రవీణ్ గౌడ్, అఖిల (25) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. 

వీరికి రెండేళ్ల కుమారుడు శ్రీయాన్ గౌడ్ ఉన్నారు. ఉన్నంతలో వారి జీవితం సాఫీగానే సాగి పోతుండగా అనారోగ్య సమస్యలతో ఏడాది కిందట ప్రవీణ్ మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడితో కలిసి అత్తారింట్లో ఉంటోంది అఖిల. తరచూ భర్తను గుర్తుచేసుకుంటూ మనోవేదన చెందేది. ఆమె బాధ చూసిన అత్తామామలు జమున, ప్రకాష్ గౌడ్లు మరో వివాహం చేసుకోవాలని కోడలికి పలుమార్లు సూచించారు.

ఉరివేసుకుని ఆత్మహత్య కానీ ఆ మాటలు పట్టించుకోకుండా మనస్తాపంతోనే ఉండేదామె. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుడికి ఉరేసి, తాను ఉరేసుకుంది అఖిల. కాసేపటికి ఇంటికొచ్చిన జమున స్థానికుల సాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు. శ్రీయాన్ ఊపిరితో ఉన్నట్లు అనిపించి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అఖిల మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh CrimeNews Distress FamilySuicide Google News in Telugu HusbandsDeath Latest News in Telugu medak MentalHealth Telangana Telugu News Today Tragedy WifeAndSon

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.