- నామినేషన్స్ మొదలైన ఖరారు కానీ అభ్యర్థులు
- జెండా మోసిన వారికి మొండి చేయి
- నాలుగు మున్సిపాలిటీల్లోను కాంగ్రెస్ డీలా
మెదక్(Medak) ప్రభాత వార్త ప్రతినిధి:
ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో జోష్ పెరిగింది. కానీ మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక లో ఇంకా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
మెదక్ మున్సిపల్ లో తలకిందులైన పరిస్థితి:
అధికార కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే ఉన్న మెదక్ మున్సిపల్ లో ఎన్నికల వేళ కాంగ్రెస్ పరిస్థితి తలకిందులూగా మారింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తప్పకుండా చేజిక్కునే అవకాశం ఉన్న మెదక్ మున్సిపల్ ఇటీవల కాంగ్రెస్ నుంచి కొంత మంది సీనియర్ నాయకులు కారెక్కడం తో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా ఏళ్ల కాంగ్రెస్ జెండా మోస్తున్న కార్యకర్తలకు కాకుండా ఎవరు ఎంత ఖర్చు పెడుతారు అనే కోణంలో టికెట్ లు ఇవ్వాలని చూస్తున్నారు అని సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెదక్(Medak) మున్సిపల్ పరిధిలో ఉన్న 32 వార్డుల్లో ఇప్పటి వరకు సగానికి పైగా వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక జరగలేదు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలు పెడితే అధికార పార్టీ నేతలు తమకు ఇంకా ఎప్పుడు సిగ్నల్ ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు.
నర్సాపూర్ మున్సిపల్ లో అభ్యర్థులు కరువు….
జిల్లాలోని రెండవ నియోజక వర్గం నర్సాపూర్ లోని నియోజక వర్గం మున్సిపల్ నర్సాపూర్ లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మున్సిపల్ పరిధిలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ముందునుంచి టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ నియోజక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ కనీసం 15 వార్డుల్లో అభ్యర్థులు పోటీ చేయడానికే అభ్యర్థుల కరువు ఉన్నట్టు తెలుస్తోంది.
రామాయంపేట కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు:
మెదక్ నియోజకవర్గం లో ని రెండవ మున్సిపాలిటీ అయిన రామాయంపేట లో ఎన్నికల వేళ గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ మున్సిపాలిటీ లో మొత్తం 12 వార్డు లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క వార్డ్ అభ్యర్థి ఖరారు కాలేదు. ముందు వచ్చిన చేతులకున్న వెనక వచ్చిన కొమ్ములు వాడి అనే చందంగా కష్టకాలం లో పార్టీని నమ్ముకుని నడిపించిన సీనియర్ నాయకున్ని కాదని ఇటీవల పార్టీలో చేరిన డబ్బున్న నాయకునికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాగ్రెస్ కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మున్సిపల్ లోని కాగ్రెస్ హవా కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తూప్రాన్ లో అదినుంచి కాంగ్రెస్ కు కష్టాలే ….
తూప్రాన్ మున్సిపల్ లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలమే ఉంది. ఇటీవల నియోజక వర్గం ఇంచార్జ్ నర్సారెడ్డి, మైనం పల్లి హనుమంత రావు అని పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసలే అభ్యర్థులు కరువు ఉన్న ఈ మున్సిపల్ రెండు వర్గాలు ఉండటంతో పాటు మైనం పల్లి వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 16 వార్డులు ఉన్న ఈ మున్సిపల్ పరిధిలో ఈ ఇప్పటి వరకు ఒక్క బలమైన అభ్యర్థిని ఎంపిక చేయలేదు. దీనికి తోడు చైర్మన్ రిజర్వేషన్ మహిళా కావడంతో మరి కొంత మంది నేతలు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. జిల్లాని నాలుగు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులు కాంగ్రెస్ పెద్దలను కలవరం పెడుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో పార్టీ ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: