Medak: రామాయంపేట మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితా విడుదల..

Read Time:  1 min
Medak
Medak
FONT SIZE
GET APP

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అధికారికంగా ప్రచురించారు. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులను కలుపుకొని మొత్తం 13,095 ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ తుది ఓటర్ల జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు

Read also: Hyderabad Police: నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

Medak

final voter list has been released in Ramayampet Municipality

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం. దేవేందర్, టీపీఓ దేవరాజ్, మేనేజర్ రఘువరన్, ఏఈ మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో పేరు నమోదు అయిన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, ఓటర్లకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, న్యాయసమ్మతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.