📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Medak: రివాల్వర్ తో బెదిరించి రూ.2.5 లక్షల దోపిడి

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాపన్నపేట (మెదక్): ఏడుపాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడీ జరిగింది. రివాల్వర్‌తో బెదిరించిన అగంతకులు హల్చల్ చేశారు. విందు ముగించుకొని సరదాగా పేకాట ఆడుతున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఆపై దర్జాగా రెండున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: solar eclipse: వచ్చే ఆగస్టు రెండున అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం

Medak Robbery of Rs. 2.5 lakh by threatening with revolver

సంఘటన వివరాలు

సుమారు 60 మంది భక్తులు హీరాలాల్ షెడ్‌లో అర్ధరాత్రి సేద తీరుతున్నారు. అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అదే సమయంలో వారు సేద తీరుతున్న హీరాలాల్ గెస్ట్ హౌస్ గేటు దూకి మూకుమ్మడిగా పదిమంది దుండగులు లోనికి చొరబడ్డారు. కొందరు మొదటి గేటు వద్ద కాపలా ఉండగా, మరికొందరు రెండో గేటు కాడ పహారా కాచారు. మరో 6 మంది షెడ్‌లోనికి చొరబడ్డారు.

చొరబడ్డవారి వద్ద రివాల్వర్ (Revolver) ఉండటంతో భక్తులను బెదిరించారు. 60 మంది వరకు ఉన్న భక్తులు రివాల్వర్ చూసి కిమ్మనలేక నిశ్చేష్టులయ్యారు. భయభ్రాంతులకు గురైన భక్తులు అందరి సెల్ ఫోన్లు తీసి దుండగులకు అప్పగించారు. అందులోనుండి తేరుకున్న మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ రాజు అనే యువకుడు వారిని అడ్డగించే ప్రయత్నం చేశాడు. వెంటనే దుండగులు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తోటి భక్తుడిపై దాడితో భయభ్రాంతులకు గురైన మిగతా భక్తులు నిశ్చేష్టులై వారి వద్ద ఉన్న రెండున్నర లక్షల నగదు దుండగులకు అప్పగించారు. అవి అందగానే దుండగులు గోడ దూకి పరారయ్యారు.

బాధితుడు ధర్మాకర్ రాజు వాంగ్మూలం

మెదక్ (Medak) పట్టణానికి చెందిన బాధితుడు ధర్మాకర్ రాజు మాట్లాడుతూ, “మేము ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం విందు ఏర్పాటు చేసుకున్నాం. అర్ధరాత్రి కొంతమంది సేద తీరుతుండగా మరికొంతమంది పేకాట ఆడుతున్నారు. అదే సమయంలో పది మంది వరకు దుండగులు రివాల్వర్‌తో వచ్చారు. వారిని చూసి అందరూ భయపడ్డారు. నేనొక్కడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశా, నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో నేను కూడా చేసేది లేక లొంగిపోయాను. ఆపై దుండగులు మా వద్ద ఉన్న రెండున్నర లక్షల నగదు ఎత్తుకొని పరారయ్యారు” అని తెలిపారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

armed robbery Edupayala robbery Google News in Telugu Latest News in Telugu Medak Crime pilgrims attacked police investigation. Telangana Crime News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.