జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
Medak: జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77 రిపబ్లిక్ డే(77th Republic Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కలెక్టరేట్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. మెదక్ నియోజక వర్గ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, ఎస్పీ డి. వి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా పాలనాధికారి కలెక్టర్ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: