📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Congress BJP Alliance : మెదక్ జిల్లాలో అనైతిక పొత్తు?

Author Icon By Tejaswini Y
Updated: February 14, 2026 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Congress BJP Alliance: జాతీయ స్థాయిలో ఎప్పుడు ఎక్కడ చూడని అనైతిక పొత్తుకు మెదక్ జిల్లా వేదిక కానుందా అంటే ప్రస్తుతం అవును అనే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ క్రీడలో అధికారం కోసం ఎన్నో రకాల పొత్తులు పెట్టుకున్న పార్టీలు మెదక్ లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయి.

Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?

కాంగ్రెస్ బీజేపీ పొత్తు దాదాపు ఖరారు..?

మెదక్ మున్సిపల్ తో నర్సాపూర్ మున్సిపల్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం తో బీజేపీ మద్దతు రెండు పార్టీలకు కీలకంగా మారింది. మెదక్ మున్సిపల్ లో మొత్తం 32 వార్డులు ఉండగా కాంగ్రెస్ 13 , బీఆర్ ఎస్ 15, బీజేపీ 2, బీఎస్పీ 01 స్థానాన్ని కైవసం చేసుకోగా ఒకటి కాంగ్రెస్ ఏకగ్రీవం అయ్యింది. నర్సాపూర్ మున్సిపల్ లో మొత్తం 15 వార్డులు ఉండగా కాంగ్రెస్ 06, బిఆర్ ఎస్ 05, బీజేపీ 04 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేదు. కాగా రెండు స్థానాల్లో బీజేపీ మద్దతు చాలా కీలకం గా మారింది. రెండు జాతీయ స్థాయి పార్టీలు కావడం ఎక్కడ ఒకరికొకరు మద్దతు ప్రకటించుకునే అవకాశం లేదని బీజేపీ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. దానికి భిన్నంగా మైనంపల్లి పావులు కదుపుతున్నారు అని దాంతో ఎక్కడ లేని విధంగా మెదక్ జిలాల్లో బీజేపీ కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

Congress BJP Alliance: Unethical alliance in Medak district?

మెదక్ కాంగ్రెస్ … నర్సాపూర్ బిజెపి ..

పొత్తులో భాగంగా జిల్లా కేంద్రం అయిన మెదక్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ వైస్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ అదేవిధంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ స్థానం బీజేపీ కి వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్ అని పొత్తుల్లో భాగంగా నిర్ణయించినట్టు అ దిశగానే పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం.

ఎంపీ నిర్ణయం వైపే అందరి చూపు….

ఇటు మెదక్ అటు నర్సాపూర్ లో బీజేపీ అభ్యర్థులుగా గెలుపొందిన అభ్యర్థులతో పాటు జిల్లా పార్టీ ముఖ్య నేతలు ఎంపీ రఘునందన్ రావు ఆదేశాలు మేరకు పని చేస్తాం అని తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులతో పాటు బీజేపీ శ్రేణులు ఎంపీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారాని సమాచారం.

పొత్తు పైన భిన్నాభిప్రాయాలు….

కాంగ్రెస్ బీజేపీ పార్టీ పొత్తు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుండటంతో మెదక్ జిల్లా లో తీవ్ర చర్చకు దారి తీసింది. అ రెండు పార్టీలు కలవడం జరగదు అని కొంత మంది నేతలు బీజేపీ అభిమానులు వాదిస్తుంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అనే అభిప్రాయం మరి వైపు వ్యక్తం అవుతోంది. మెదక్ జిల్లాలో కొత్త రకం పొత్తులకు తెర తీసిన రాజకీయం ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Congress BJP Alliance Medak Municipal Election Politics MP raghunandan rao Mynampally Hanumanth Rao Narsapur Municipality Telangana municipal elections 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.