Medak Municipal Elections:హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్

Read Time:  1 min
Medak Municipal Elections:హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్
FONT SIZE
GET APP

Medak Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెదక్ పట్టణం 14, 15, 30 వ వార్డుల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, పదేండ్లు డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని చెప్పి మిషన్ భగీరథ పేరుతో 65 వేల కోట్లు మింగిండ్రు అన్నారు.

Read Also:TG: పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

గతం లో నిరుపేదలు రేషన్ లో ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక అమ్ముకునే వారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలు మంచి భోజనం చేయాలని సన్న బియ్యం ఇస్తోందని అన్నారు. గత ప్రభుత్వం పది ఏళ్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, మన ప్రభుత్వం వచ్చాకే అందరికి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు. బి ఆర్ ఎస్ పాలన లో ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించారని అన్నారు.

Medak Municipal Elections: రెండు నెలల్లో కొత్త పెన్షన్లు.. విద్యకు పెద్దపీట

వచ్చే రెండు నెలల్లో అర్హులైన వారందరికి పెన్షన్లు సైతం ఇస్తామని అన్నారు. మెదక్ నియోజకవర్గానికి రూ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చామని, రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. మెదక్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇక్కడ చదువుకొని డాక్టర్లు అయ్యే మంచి అవకాశం ఏర్పడిందని అన్నారు. మీరు మన అభ్యర్థులను గెలిపిస్తేనే తాము సీఎం తో కోట్లాడి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్ధులు దొంతి నరేష్, లక్ష్మి లను గెలిపించాలని కోరారు.

Medak Municipal Elections
Medak Municipal Elections: We will fulfill all promises: Minister Vivek

మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పదేండ్లు ఇళ్ళు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని అన్నారు. మన ప్రజా ప్రభుత్వం రాగానే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామని, మరి కొందరికి రెండవ విడత తో ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పదేళ్ల తర్వాత ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దె అన్నారు. కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన వాటితో పాటు గతంలో ఉన్న రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని అందరిని సమానంగా చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

గత ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతో ఓట్లు వేసుకునేందుకు రైతు బంధు డబ్బులు వేశారని అన్నారు. ఏడుపాయల కు గతంలో ఏ సీఎం రాలేదని, మన సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి వచ్చి 35 కోట్ల అభివృద్ధి పనులకు నిదులిచ్చారని అన్నారు. గత పాలకులు ఏడుపాయలకు 100 కోట్లు ఇస్తామని చెప్పారని, కానీ పేపర్లకే పరిమితమైంది ఎద్దేవా చేశారు. బి ఆర్ ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెదక్ చర్చికి ఒక్క రూపాయి ఇవ్వాలె, మన సీఎం రేవంత్ మన చర్చి 29.30 కోట్లు ఇచ్చారని అన్నారు.

వరదలు వచ్చినప్పుడు మన ప్రభుత్వం వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడామని, వరదలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి, వరదల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు పరిహారం ఇచ్చారని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని, ఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రజల డబ్బులే అన్నారు. బి ఆర్ ఎస్ హాయంలో నిధులన్నీ సిద్దిపేట కు, గజ్వేల్ కు, సిరిసిల్ల కు మాత్రమే ఇచ్చారని విమర్శించారు.

మెదక్ నియోజకవర్గం లో మా సొంత నిధులతో గతంలో రెండు వేల బోర్లు వేశామని అన్నారు. ఇప్పటి నుంచి మెదక్ లో హరీష్ రావు ఆటలు చెల్లవు అని, అభివృద్ధి కి అడ్డుకునే ప్రయత్నం ఊరుకునేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు,మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాజీ కౌన్సిలర్లు,14,15,30 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్, నరేష్ గౌడ్,అరుణర్తి వెంకటరమణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.