📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medak Senior Citizen Day Care: వయోవృద్ధుల కోసం మెదక్‌లో డే కేర్ సెంటర్.. ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ప్రారంభం

Author Icon By Siva Prasad
Updated: March 6, 2026 • 8:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Medak Senior Citizen Day Care: మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

Read Also: Medak District Development Review: అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి.. మంత్రి వివేక్

వయోవృద్ధులకు ప్రత్యేక వసతులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. వయోవృద్ధులు తమ శేష జీవితాన్ని సంతోషంగా, ఒత్తిడి లేకుండా గడిపేందుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. వయోవృద్ధుల సౌకర్యార్థం తన సొంత నిధులతో ఒక బ్యాటరీ వెహికల్ (Battery Vehicle) అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కేంద్రంలో వయోవృద్ధుల కాలక్షేపం కోసం ఆట సామగ్రి, వార్తా పత్రికలు, పుస్తకాలతో పాటు స్వయంగా వంట చేసుకునేందుకు అవసరమైన సామగ్రిని కూడా అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

Medak Senior Citizen Day Care: Day care center for the elderly in Medak.. inaugurated by MLA and MP

Medak Senior Citizen Day Care: అధికారులు అంకితభావంతో పనిచేయాలి: ఎంపీ

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమం కోసం అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ డే కేర్ కేంద్రాన్ని ‘సేవాసంఘం’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సమస్యలన్నీ మర్చిపోయి వయోవృద్ధులందరూ ఇక్కడ ఉల్లాసంగా గడపవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, సేవాసంఘం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సతీష్, శ్రీధర్, డిసేబుల్ సెక్షన్ అధికారి జింక రవీందర్ మరియు జిల్లాలోని పలువురు వయోవృద్ధులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Elderly Welfare Schemes Telangana Medak News Today Medak Senior Citizen Day Care MLA Mainampally Rohit Rao MP raghunandan rao Seva Sangham NGO Medak

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.