📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mallikarjun Goud Arrest: అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

Author Icon By Siva Prasad
Updated: February 28, 2026 • 10:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mallikarjun Goud Arrest: మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మున్సిపల్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ గౌడ్‌ను శనివారం ఉదయం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని ఇంట్లో బంధించి బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అయితే, కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం న్యాయస్థానం ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

Read Also: Kokapet Lands : కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

పోలీసుల తీరుపై పద్మా దేవేందర్ రెడ్డి మండిపాటు

మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి మల్లికార్జున్ గౌడ్‌ను తెల్లవారుజామున అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు, అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము హెచ్‌ఆర్‌సీ మరియు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Mallikarjun Goud Arrest: There is nothing to fear from illegal arrests: Padma Devender Reddy

Mallikarjun Goud Arrest: కుట్ర పూరితంగానే కేసులు: మల్లికార్జున్ గౌడ్

బెయిల్ పొందిన అనంతరం మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కుట్రపన్ని తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారని, చట్టాన్ని అతిక్రమించిన అధికారులను న్యాయస్థానానికి ఈడుస్తామని స్పష్టం చేశారు.

మల్లికార్జున్ గౌడ్‌కు బెయిల్ రావడంతో కోర్టు వద్దకు భారీగా చేరుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు మద్దతుగా నిలిచారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also :

BRS vs Congress Medak Mallikarjun Goud Arrest Medak Court Bail Medak Municipal Elections 2026 Medak News Today Padma Devender Reddy Political Revenge Cases AP TS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.