📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Medak: ప్రతి విద్యార్ధి మరో ముగ్గురికి సైబర్ నేరల పై అవగాహనా కల్పించాలి.

Author Icon By Saritha
Updated: January 7, 2026 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రాడ్ క ఫుల్ స్టాప్ – థింక్ బిఫోర్ యు క్లిక్.

సైబర్ జాగ్రూకత దివస్‌ను పురస్కరించుకొని (Fraud Ka Full) స్టాప్ సైబర్ క్రైమ్ అవగాహన ప్రచారం కింద, ఈ వారపు థీమ్ “మహిళల రక్షణ – పిల్లల సంరక్షణ” ఆధారంగా, విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో మెదక్ (Medak) పట్టణంలోని తెలంగాణ (Telangana) ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డేటింగ్ యాప్‌ల ద్వారా జరిగే మోసాలు, సైబర్ బుల్లీయింగ్, సైబర్ స్టాల్కింగ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి వివిధ రకాల సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల బాధితులకు కలిగే ఆర్థిక నష్టాలను ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు.

Read also: Warangal Crime: భర్తపై కత్తితో దాడికి యత్నం.. వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

అలాగే మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ స్టాల్కింగ్, బ్లాక్‌మెయిల్, డిజిటల్ దుర్వినియోగం వంటి అంశాలపై భయం లేకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా తెలియజేశారు. (Medak) ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత సైబర్ మోసాలకు సులభంగా బలవుతున్నారని పేర్కొన్నారు. డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని నమ్మకం పొందిన అనంతరం మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయని, అపరిచితులపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని, అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరించారు.

సైబర్ నేరాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన

(Medak) ప్రతి విద్యార్థి తాను తెలుసుకున్న సైబర్ భద్రతా సమాచారాన్ని కనీసం ముగ్గురు స్నేహితులకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే భయపడకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమయానికి ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు. సైబర్ అవగాహన క్విజ్ పోటీలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీ సుభాష్ చంద్ర బోస్, కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి, అధ్యాపకులు, సైబర్ క్రైమ్ సిబ్బంది సయ్యద్, సతీష్, సాయి కిరణ్, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Cyber Awareness cyber crime prevention Fraud Ka Full Stop Medak district telangana police Telugu News Women and Child Safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.