Medak district: పెద్ద శంకరంపేట (మెదక్) వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ అన్నారు. మంగళవారం నాడు స్థానిక ఫంక్షన్ హాలులో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు, విద్యార్థులకు అరైవ్ -ఆలైవ్ ప్రోగ్రాం లో భాగంగా మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ తో కలిపి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
Read Also: Elections: తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలషెడ్యూల్ విడుదల
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం రహదారి నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రహదారి నిబంధనలను పాటించాలని హితవు పలికారు.
వాహనదారులు కచ్చితంగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. బాధ్యతారాహిత్యంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణ పై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం రేగోడ్ ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: