Medak Collector: ప్రతిమ సింగ్ మార్క్ పాలన సాగేనా…?

Read Time:  1 min
Medak Collector: ప్రతిమ సింగ్ మార్క్ పాలన సాగేనా…?
FONT SIZE
GET APP

మెదక్ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా సీనియర్ ఐఏఎస్ ప్రతిమ సింగ్ మెదక్ జిల్లా(Medak Collector) కు పై బదిలీ పై వచ్చి జిల్లా పాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పాలన అధికారిగా బాధ్యతలు చేపట్టిన్నప్పటికీ ఆమె 2019 లో జిల్లా అదనపు( స్థానిక సంస్థల) కలెక్టర్ గా పని చేసిన అనుభవం జిల్లా పైన పూరి స్థాయి అవగాహన కలిగి ఉన్నారు. ఆమె అదనపు జిల్లా కలెక్టర్ గా మెదక్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. స్థానిక సంస్థల అధికారిగా బాధ్యతలు నిర్వచించిన ఆమె జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పై పట్టు సాధించారు.

Read Also: Senior Sweeper Salary: తెలంగాణలో స్వీపర్ జీతం రూ. 2 లక్షలు

Medak Collector: Will Pratima Singh Mark's rule continue?
Medak Collector: Will Pratima Singh Mark’s rule continue?

మార్క్ పాలన కొనసాగేనా…?

అదనపు కలెక్టర్ గా అని చేసిన ఆమె జిల్లాలో ఒక ప్రత్యేక అధికారిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు పూర్తి స్థాయి జిల్లా పాలన అధికారిగా బదిలీ పై వచ్చిన ఆమె అదే మార్క్ పాలన కొనసాగిస్తుందా లేదా అనే అభిప్రాయాన్ని జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఆమె పని తీరు అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా జిల్లా కేంద్రం అయిన మెదక్ మున్సిపల్ పరిధి లో అక్రమ కట్టడాలపై ఆమె కొరడా ఝళిపించారు. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా కొన్ని కట్టడాలని సైతం కాల్చివేశారు. అంతేకాకుండా అక్రమ కట్టడాలు వెంచర్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూములు కబ్జలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలు ఇచ్చారు. దీంతో పాటు మున్సిపల్ కేంద్రాలు పంచాయితీల పరిధిలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టారు.

ఐఏఎస్ ప్రతిమ సింగ్(Pratima Singh) అంటే నీతికి , నిజాయితీకి మారుపేరు అనే ముద్ర పడింది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా లెక్కచేయని అధికారిగా ఆర్భాటాలకు , ప్రచారాలకు దూరంగా ఉంటూ తన పాలన కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిని ఇప్పుడూ పూర్తి స్థాయి జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టడం తో అదే మార్క్ పాలన కొనసాగితే జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని ప్రజలు కోరుకుంటున్నారు.

కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమ సింగ్ :

మెదక్ జిల్లా నూతన కలెక్టర్ గా బదిలీ పై వచ్చిన ఐఏఎస్ ప్రతిమ సింగ్ గురువారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన కలెక్టర్ రాహుల్ రాజ్ ఆమెకు బాధ్యతలు అప్పగించి అభినందనలు తెలిపారు. అనంతరం జిలా అదనపు కలెక్టర్ నగేష్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.