జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులు ,మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా (Medak) జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.
Read also: Medak: రామాయంపేట మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితా విడుదల..
ఎన్నికల ఏర్పట్ల గురించి అడిగి తెలుసుకున్నారు
వార్డులు, వార్డులలో పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, వార్డుల వారీగా ఓటర్ లిస్టులు, ఓటర్ డ్రాప్ ను , ఆరోలు ఏఆర్వోలు, మున్సిపల్ ఎన్నికల సిబ్బంది అంతా ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ వారీగా మున్సిపల్ కమిషనర్లను ఎన్నికల ఏర్పట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: