77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు
Medak: 77వ గణతంత్ర దినోత్సవాన్ని(77th Republic Day) పురస్కరించుకుని ఈ రోజు జిల్లా క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృభూమి కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగప్రాయంగా అర్పించిన ఫలితంగా మనకు భారత రాజ్యాంగం లభించిందని తెలిపారు. భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు గణతంత్ర దినోత్సవం అత్యంత విశిష్టమైనదని పేర్కొన్నారు.
Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులు(Responsible citizens)గా జీవించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేని సమానత్వ భారత నవసమాజం కోసం రాజ్యాంగం రచించబడిందని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని, ప్రతి బాధితుడికి న్యాయం అందించినప్పుడే మన భారత రాజ్యాంగానికి సార్థకత ఉంటుందని అన్నారు. విధులను అంకితభావంతో నిర్వర్తించి ప్రజల మనసులు గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డియస్పి లు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, రంగా నాయక్, సీఐలు, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, మహేష్, జర్జ్, శైలందర్, రాజశేఖర్ రెడ్డి ఎసై లు సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: