📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: MD Manoj Gaurnu: ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ

Author Icon By Saritha
Updated: November 14, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు రూ. 12 వేల కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు

హైదరాబాద్ : హెలికాప్టర్ తో శ్రీశైలం ఎడమగట్టు సొరంగం భూభౌతిక పరిస్థితి అధ్యయనం చేస్తున్న హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే దాదాపు తుది అంకం చేరుకొంటున్న సమయంలో మనీల్యాండరింగ్ కేసులో జెపి ఇన్ఫ్రాటెక్ ఎండి మనోజ్ గౌర్ను గురువారం ఎన్ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంతో ఎస్ఎల్బిసి(MD Manoj Gaurnu) నిర్మాణంపై మరోమారు అనిశ్చితి నెలకొంది. జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ సంస్థకు గతంలో మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్, సిఇఒగా కూడా ఆయన విధులు నిర్వహించారు. జెపి విష్ టౌన్, జెపి గ్రీన్స్ ప్రాజెక్ట్స్ వద్ద ఇండ్లు ఖరీదు చేసిన వారు ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్థిక నేర శాఖ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఢిల్లీ, యూపీకి చెందిన జెపి గ్రూపుపై ఇడి తనిఖీలు నిర్వహిస్తున్నది. జై ప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీ చీటింగ్ కు పాల్పడినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 12 వేల కోట్ల మేర మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పీఎంఎల్ఎ చట్ట కింద గౌర్ను అరెస్టు చేశారు. ఇండ్లు ఖరీదు చేసిన వారి డబ్బులను దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఆ నిధులను దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read also: మహాఘట్ బంధన్‌ను వెనక్కి లాగుతున్న కాంగ్రెస్

MD Manoj Gaurnu: ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ

ఎస్ఎల్బిసి సొరంగం నిర్మాణం & హెలీబోర్న్ సర్వే

ఎస్ఎల్బీసి నిర్మాణం పనులు ఈ సంస్థకు అప్పగించవద్దని నీటిపారుదలశాఖ అధికారులు సూచించినా కూడా మళ్ళీ జెపి సంస్థకు అప్పగించడమే కాకుండా గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇప్పటికే ఎస్ఎల్బిసి నిర్మాణం పనులు నత్తలకు నడక నేర్పుతోన్నది. దీనికి తగ్గట్లు అనేక ఆటంకాలు అడుగడుగున జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిపోయి అందులో పనిచేసే కార్మికులు గల్లంతైనారు. ఇద్దరి మృతదేహాలు మినహా మిగితా వరకు కార్మికుల ఆచూకి తెలుసుకులేకపోయారు. షీర్ జోన్స్ సమస్యలేకుండా ఎస్ఎల్బిసి సొరంగం గుర్రపుడెక్క ఆకారంలో తవ్వి పాత మార్గంకు ఔట్లెట్వెపు కలుపాలని ప్రభుత్వం హెలికాఫ్టర్తో సర్వేకూడా వేగవంతంగా చేస్తున్నది. ఇలాంటి సమయంలో జెపి సంస్థ ఎండి మనోజ్గౌర్ అరెస్టు కావడంతో మన ఎన్ఎల్బీసి డిసెంబరు 2026కు పూర్తిచేయాలనే లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది కాలమే జవాబు చెప్పాలి. నేషనల్ జియో ఫిజికల్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ప్రత్యేక హెలీకాప్టర్ మన్నెవారిపల్లి ఔట్ లెట్ నుంచి దోమలపెంట ఇన్లెట్ తిరుగతూ సర్వే పదకొండు రోజులుగా జరుగుతోన్నది. మ్యాగ్నమీటర్, రిసీవర్, ట్రాన్స్ మిట్టర్ లూప్ లుఅమర్చిన ప్రత్యేక హెలీకాప్టర్ను సర్వేకు ఉపయోగిస్తున్నారు.

హెలీకాప్టర్ సర్వే విశ్లేషణ

హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన ప్రతి సారి గాలిలో దాదాపు 150 మీటర్ల ఎత్తు నుంచి ఐదు నుంచి ఎనిమిది చక్కర్లు కొడుతూ భూమిలోపల దాదాపు 500 నుంచి 800 మీటర్ల లోతు వరకు విద్యుదయస్కాంత తరంగాలను(Electromagnetic wave) ప్రసరింప చేస్తూ ప్రతి ఇంచు ఇంచు జల్లెడ పడుతోన్నది. ప్రమాదం జరిగిన ప్రాంతం, ఇక ముందు తవ్వాల్సిన సొరంగ అలైన్మెంట్ తోపాటు సొరంగ మార్గం తవ్వకం పూర్తైన ప్రాంతాన్ని శాస్త్రజ్ఞులు (MD Manoj Gaurnu) పరిశీలించాలని నిర్ణయించడంతో 43 కి.మీ. నిడివిలో సొరంగం అడ్డం సుమారు 3 కి. మీ. పరిధిలో సర్వే చేస్తున్నారు. దీని కోసం సొరంగం ప్రతిపాదితన ప్రాంతంను 14 వరుసలుగా విభజించుకుని, ఒక్కో వరుసలో 100 నుంచి 500 మీటర్ల మధ్య సర్వే చేపడుతున్నారు. దీని ద్వారా భూమిలోపల షీయర్ జోన్స్ వంటి ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన వెంటనే నవం బరు 29లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుండటంతో ఎస్ఎల్బిసి సొరంగం తవ్వకానికి సమాయత్తం అవుతున్న సమయంలో జెపి ఇన్ఫ్రాటెక్ ఎండి అరెస్టుకావడం ఎస్ఎల్బిసి కష్టాలు తీరడం ఇప్పట్లో సాధ్యమౌతుందా అనే అనుమానం మొదలైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Enforcement Directorate (ED) JP Infratech Latest News in Telugu Manoj Gaur Arrest Money Laundering SLBC Tunnel Srisailam Left Bank Canal Telugu News tunnel collapse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.