మేడే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మికుల పాత్ర కీలకమని, వారి శ్రమకు సముచిత గౌరవం ఇవ్వాలన్న దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.
మేడే యొక్క స్ఫూర్తి పాలన వ్యవస్థ
రాష్ట్ర అభివృద్ధిలో కార్మికులు కీలక భాగస్వాములుగా నిలుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. అన్ని రంగాల్లో కార్మికుల భాగస్వామ్యం పెరగాలని, మేడే యొక్క స్ఫూర్తి పాలన వ్యవస్థలో ప్రతి స్థాయికి విస్తరించాలని ఆకాంక్షించారు. కార్మికుల సమర్థతను పెంపొందించేందుకు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగం కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ గిగ్, ప్లాట్ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు – 2025
కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలు రూపొందిస్తోందని సీఎం వెల్లడించారు. త్వరలో ‘తెలంగాణ గిగ్, ప్లాట్ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు – 2025’ ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ బిల్లు ద్వారా డెలివరీ బాయ్స్, టాక్సీ డ్రైవర్స్, అప్లికేషన్ ఆధారిత కార్మికులకు మద్దతుగా నూతన నిబంధనలు, ప్రయోజనాలు తీసుకురావడం జరుగుతుందన్నారు.
Read Also : Jagan : సింహాచలం ఘటనపై జగన్ సీరియస్..ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం