📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Srigandham Smuggling : చేవెళ్లలో భారీగా గంధం చెక్కల స్మగ్లింగ్

Author Icon By Divya Vani M
Updated: July 2, 2025 • 8:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగారెడ్డి జిల్లాలో పోలీసులకు భారీ విజయం దక్కింది. ‘పుష్ప’ సినిమా తరహాలో శ్రీగంధం చెక్కల అక్రమ రవాణా (Illegal trafficking of sandalwood) వెలుగు చూసింది. డీసీఎం వాహనంలో దాచిన (Sri Gandham) చెక్కలను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం వెయ్యి కిలోల చెక్కలు స్వాధీనం చేసుకున్నారు.చేవెళ్ల మండలం బస్తేపూర్ శివారులో పోలీసులు తనిఖీలు (Police checks in the suburbs) చేశారు. ఈ సమయంలో అనుమానంగా కనిపించిన డీసీఎంను ఆపి పరిశీలించారు. వాహనంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో చెక్కలను దాచినట్టు గుర్తించారు. వీటిని మహారాష్ట్ర నుంచి రంగారెడ్డికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Srigandham Smuggling : చేవెళ్లలో భారీగా గంధం చెక్కల స్మగ్లింగ్

పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ పేరుతో భారీ స్మగ్లింగ్

నాగర్‌గూడలో ఉన్న ఒక పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి ఈ చెక్కలు వెళ్లాల్సిందిగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ చెక్కల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. మార్కెట్‌లో శ్రీగంధం చెక్కలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

ముగ్గురు అరెస్ట్.. ఇద్దరు పరారీ

ఈ స్మగ్లింగ్ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు డ్రైవర్ అబ్దుల్ అజీజ్, సూపర్వైజర్ సోహెబ్, రైతు విజయ్ హనుమంతు. కానీ ఈ గుట్టును నడిపించిన పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్ కుర్వి, మేనేజర్ సిద్ధిఖ్ పరారీలో ఉన్నారు. వీరిలో కొంతమంది మరో రాష్ట్రానికి పారిపోయిన సూచనలు ఉన్నాయి.

పోలీసుల ప్రత్యేక బృందాలు గాలింపు చర్యల్లో

పట్టుబడిన నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Read Also : Kavitha : బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలు : కవిత

Chevella police illegal trafficking in DCM Madhapur SOT perfume factory irregularities Rangareddy district news seizure of wood smuggling of flower-like wood Smuggling of Srigandham

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.