📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: IPS Transfers: టీజీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. శాంతి భద్రతల నిర్వహణ, పాలనలో వేగం పెంచడం, విభాగాల మధ్య సమన్వయం బలోపేతం చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆరుగురు ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీల (IPS Transfers) కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారిక ప్రకటన రూపంలో వెల్లడించారు.

Asifabad District: ఎలుగుబంటి దాడిలో దంపతులు మృతి

ఆర్టీసీ ఎండీగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్ (VC Sajjanar) బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎండీగా మరో ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఇక సజ్జనార్ నాలుగేళ్ల తర్వాత యూనిఫాం వేసుకోనున్నారు. తాజాగా బదిలీల్లో భాగంగా ఆయన్ను రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌‌ (Police Commissioner) గా కీలక పోస్టులోకి పంపింది.

ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌కు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్‌ను నియమించారు.

హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝా

అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ (Vikram Singh) నియమితులయ్యారు. హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, అడిషనల్ సీపీ (శాంతిభద్రతలు)గా తసఫీర్ ఇక్బాల్ బదిలీ అయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్, నారాయణ పేట్ ఎస్పీగా వినీత్ బదిలీ అయ్యారు.

IPS Transfers

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌దా సందీప్ కుమార్ ఝా స్థానంలో హరితను నియమించారు. హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝాకు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్‌గా రఘునందన్ రావు నియమితులయ్యారు.

మరోసారి యూనిఫాం పోస్టులోకి బదిలీ అయ్యారు

వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్‌కు బాధ్యతలు కట్టబెట్టారు.సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా 2021 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలో నష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి లాభాల వైపు మళ్లించడానికి, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సేవలను మెరుగుపరచడానికి అనేక కీలక సంస్కరణలు,

కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆయన మరోసారి యూనిఫాం పోస్టులోకి బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ కొత్త డీజీపీగా శవధర్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకు ప్రస్తుత డీజీపీ జితెందర్ బదిలీ కానుండగా.. ఆయన స్థానంలో శవధర్ రెడ్డి డీజీపీగా కొనసాగనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Hyderabad Police Commissioner ias officers transfer ips officers transfer latest news nagireddy rtc md telangana administrative reforms Telugu News vc sajjanar transfer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.