Maoist Leaders Meeting: తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మావోయిస్టు పార్టీకి చెందిన కీలక అగ్రనేతలతో భేటీ జరగనుంది. ఈ సమావేశం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు, అంతర్గత భద్రతా చర్చలకు వేదిక కానుంది.
Read Also: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

మావోయిస్టు నేతలతో చర్చ
ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క పాల్గొననున్నారు. వీరితో పాటు దామోదర్, నూనె నరసింహారెడ్డి కూడా ఈ చర్చల్లో భాగస్వాములు కానున్నారు. ప్రభుత్వ తరపున సలహాదారు కె. కేశవరావు ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలు లేదా శాంతి చర్చల దిశగా ఈ అడుగులు పడుతున్నాయా అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. నేతలతో భేటీ కావడానికి ముందే పోలీసు అధికారులతో సమావేశం కానున్నారు. DGP శివధర్ రెడ్డి, ఐజీ సుమతి కాసేపట్లో సీఎంను కలిసి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక అందించనున్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: