📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Maoist Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై ప్రజల్లో ఉత్కంఠ

Author Icon By Saritha
Updated: March 6, 2026 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీర్పూర్ గ్రామస్థుల ఎదురుచూపులు లొంగిపోవాలంటూ

Maoist Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణ పతి లొంగుబాటుకు సిద్దమైనట్లు వార్తలు వస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది. 2025 జూన్ 8 నుంచి ఆగస్టు 10 వరకు అబూజ్మడ్లో ఉన్న గణపతి నేపాలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అమి త్ సమక్షంలో గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోయేం దుకు నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు తెలియడంతో ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ లో గత రెండు రోజులుగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

గ్రామంలోని వృద్ధులు, యువకులు, మహిళలు ఆసక్తితో యూట్యూబ్, టివి వార్తలు వీక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచా రాన్ని తెలుసుకుంటున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఉద్యమాల్లోకి వెళ్లిన గణపతి ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనే ఆత్రుతతో బీర్పూర్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గణపతి సోదరుడు మాజీ జడ్పీటిసి ఆయన లొంగిపోవాలని కోరుతూ విన్నపాలు చేశారు. ముపాల గణపతి లొంగిపోవాలని 2013లో బీర్పూర్ గ్రామంలో అప్పటి ఎస్పీ శివకుమార్ ఆద్వర్యంలో అంతర్మథనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎస్పీ శివకుమార్ బస చేశారు. వేదికపై గణపతి లొంగిపోవాలని జనస్రవంతిలో కలవాలని ఎస్పీ ఆహ్వానించారు.

Read Also: TG Monkeys Menace: కోతుల సమస్యతో కొత్త సర్పంచ్లు ఉక్కిరిబిక్కిరి

Maoist Ganapathi: Public excitement over the surrender of Maoist top leader Ganapathi

కుమారుడి భావోద్వేగ విన్నపం

తాజాగా గణపతి కుమారుడు కూడా నాన్న లొంగిపో అంటూ విన్నపాలు చేసే ఆడియో సామాజిక_మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో అనేక మంది అది వింటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా ‘నాన్నా’ అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని ‘నాన్నా’ అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధా శక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు.

కుటుంబ ఆవేదన

అనాలోచితంగా కానీ, నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానై పెంచింది. నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది… ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజానికి ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచిందంటూ.. ఆయన తండ్రిని జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రాధేయపడుతూ విన్నపాలు చేశారు.

ఇదిఇలా ఉంటే ఇప్పటికి ఆయ నను ఉద్యమంలో దగ్గర నుంచి చూసినవాళ్ళు మాత్రం గణపతి మరో దళపతిగా మారి లొంగిపోకుండా ఉంటారని ఆయన మరణం కూడా సుభాష్ చంద్రబోస్ మరణం వలే మిస్టరీగా మారుతుందని అంటున్నారు. ఏదీ ఏమైనా లక్ష్మణ్ రావు లొంగుబాటుపై మాత్రం అనేక ఊహా గానాలతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

jagtial Latest News in Telugu Maoist Ganapathi Surrender Muppala Lakshman Rao Naxalite Leader Ganapathi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.