📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Manchiryala District: మా కూతురు చనిపోయింది.. వరకట్నం వెనక్కి ఇవ్వండి అంటూ తల్లి ఆవేదన

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఓ హృదయవిదారక సంఘటన వెలుగు చూసింది. వివాహిత లావణ్య (29) మృతి అనంతరం, ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న వరకట్నాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అంత్యక్రియలు నిర్వహించడాన్ని నిరాకరించారు. దీంతో లావణ్య మృతదేహాన్ని రెండు రోజులపాటు అంబులెన్స్‌ (Ambulance) లోనే ఉంచారు.లావణ్య, రామకృష్ణాపూర్‌కు చెందిన యువతి. ఆమె 2021లో అదే పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు సురేష్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు దంపతుల జీవితం సవ్యంగా సాగినా, అనంతరం విభేదాలు తలెత్తాయి. తరచూ గొడవలు జరగడంతో, లావణ్య తన భర్త ఇంటిని వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.

భర్త సురేష్ ఇంటి ముందుకు తీసుకువచ్చి

ఈ నెల 16న లావణ్య తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, వీరికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లావణ్య తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, లావణ్య (Lavanya) ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆమె కూడా మృతిచెందింది.శుక్రవారం రాత్రి లావణ్య మృతదేహాన్ని భర్త సురేష్ (Suresh) ఇంటి ముందుకు తీసుకువచ్చి, ఆమె తల్లి, సోదరులు, కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. “మా అమ్మాయి మృతి చెందింది. ఆమెకు ఇచ్చిన రూ.50 లక్షల వరకట్నం, 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వండి. లేనిపక్షంలో మృతదేహాన్ని మీరు స్మశానానికి తీసుకెళ్లాలన్న ఆశించవద్దు” అని తేల్చిచెప్పారు.ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో, శవాన్ని రెండు రోజులపాటు అంబులెన్స్‌లోనే ఉంచారు. స్థానికులు, సామాజిక వేత్తలు, పోలీసుల సమక్షంలో పరస్పర చర్చలు జరిగినా, లావణ్య కుటుంబ సభ్యులు తమ డిమాండ్‌పై కట్టుబాటుగా ఉన్నారు.

మంచిర్యాల జిల్లా ఎక్కడ ఉంది?

మంచిర్యాల జిల్లా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది రాష్ట్ర ఉత్తర భాగంలో ఉంది.

మంచిర్యాల జిల్లా ఎప్పుడు ఏర్పడింది?

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పునర్విభజన సమయంలో, 2016 అక్టోబర్ 11న మంచిర్యాల జిల్లా ఏర్పడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Weather Alert: ఆంధ్ర, తెలంగాణకు వచ్చే 3 రోజులు భారీ వర్షసూచన

Ambulance Protest Breaking News Dowry Dispute Dowry Return Demand Emotional Family Protest latest news Lavanya Death Mancherial News Ramakrishnapur Town Telangana Incident Telangana Tragedy Telugu News Woman Death Dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.