Mancherial corporation : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల్లో అధికార సమీకరణాలు స్పష్టమయ్యాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య ఎన్నికయ్యారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మరియు స్వతంత్ర సభ్యుల మద్దతుతో బండారి అనూష ఛైర్‌పర్సన్‌గా, మహ్మద్ రోహిత్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఆధిపత్యం సాధించింది. అక్కడ ఛైర్మన్‌గా మెంగ్రే ఆకాశ్, వైస్ ఛైర్‌పర్సన్‌గా అహ్మద్ ఎన్నికయ్యారు.
Read Also: India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?
బైంసా మున్సిపాలిటీలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి తూమెల్ల దత్తాత్రి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా ఖతుజా సిద్ధికి ఇద్రిస్ ఎన్నికయ్యారు.
ఇక నిర్మల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక్కడ భార్యాభర్తలు అప్పాల కావ్య ఛైర్‌పర్సన్‌గా, అప్పాల గణేశ్ చక్రవర్తి వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. ఛైర్‌పర్సన్‌గా దొంత అంజలీదేవి, వైస్ ఛైర్‌పర్సన్‌గా మోత్కూరి రాజేశ్వరి ఎన్నికయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: