నేటి పిల్లలు సున్నితంగా తయారవుతున్నారు. వారి బాగుకోసం ఏకాస్త మందలించినా దాన్ని సీరియస్ గా తీసుకుని, ఊహించని నిర్ణయాలను తీసుకుంటున్నారు. సెల్ ఫోన్లను ఎక్కువ చూడొద్దని, బుద్ధిగా చదువుకోవాలని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు మందలిస్తే ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలో మార్కులు తక్కువ వస్తే చావాల్సిందే, కోరినది అమ్మానాన్నలు ఇవ్వకపోతే ఇక బతుకే వేస్ట్.. ఇలా అన్ని సమస్యలకు చావే పరిష్కరంగా భావిస్తున్నారు నేటి పిల్లలు. తాజాగా ఓ బాలుడు క్రికెట్ ఆడవద్దు, హోంవర్కు చేయాలని కోరిన తల్లిపై కోపంతో క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు (suiside) పాల్పడ్డాడు. దీనికి సంబంధంచిన వివరాలు ఇలా ఉ
న్నాయి.
Read also: Ahmedabad: బెంజి కారులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా.. డ్రగ్స్ రాకెట్ పట్టివేత

Mancherial
చున్నీతో ఉరివేసుకుని, చనిపోయిన కుమారుడు
మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆకర్ష్ (14) అనే బాలుడు ఉన్నాడు. ఆకర్ష్ ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ, చదువు, హోవర్క్ నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో ఆకర్ష్ తల్లిదండ్రులు కుమారుడిని మందలించారు. చదువుపై శ్రద్ధ చూపాలని, ఆటపై కాదని హితవు పలికారు. దీంతో ఆకర్ష్ క్షణికావేశంలో బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకుని, ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపటి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీయగా కుమారుడు విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీన్ని చూసిన వారు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి వచ్చిన కుమారుడు తమకు దూరమైపోయాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. చదువుకోమని మంచి మాట చెప్పినా తప్పే అయిందని గుండెలు అవిసేలా విలపించడం అందరినీ కలచివేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: