ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, మరెన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించినా, వెచ్చిస్తున్నా ప్రజలను పౌష్టికాహార లోపంనుండిగట్టెక్కించలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో కోట్లాది మంది పౌష్టికాహార లోపంతో రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రపంచ జనాభాలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల్లో ఇరవైఐదు శాతంపైగా భారతావనిలోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు ఏనాటి నుంచో ఘోషిస్తున్నాయి. ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో దాదాపు నలభై శాతం మంది తక్కువ బరువుతో పుడుతున్నారని, వారిలో దాదాపు ఆరేడు శాతం మంది పిల్లలు పుట్టిన ఐదేళ్లలోపు మరణిస్తున్నా రని ఎన్నో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ భూమ్మీద పుట్టిన వారు ఎవరికైనా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటిది కన్నులైనా సరిగ్గా తెరవని పసిగుడ్డులకు సరైన ఆహారం అందక చనిపోతే దానికి బాధ్యత వహించాల్సింది పాలక పెద్దలే. తల్లీబిడ్డకు పోష కాహారం అందివ్వలేకపోవడం పాలకుల బాధ్యతారాహి త్యం కిందకే వస్తుంది. అందుకోసం దేశవ్యాప్తంగా కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోతే పోయారు. ఉన్న పథకాలను ఏ మేరకు అమలు చేస్తున్నారో అర్హులైన వారిలో ఎంత మందికి అందిస్తున్నారో అవి ఏ మేరకు వారికి అందుతు న్నాయో అధ్యయనం చేయడమే కాదు, పర్యవేక్షణ కూడా అవసరం. పర్యవేక్షణలోపం కారణంగానే తల్లీబిడ్డలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతున్న విషయం ఎన్నోసార్లు వెలుగు చూసినా నిర్దిష్టమైన చర్యలు లేకపోవడంతో నిరాటంకంగా కొనసాగుతున్నది. భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పౌష్టికాహార లోపం(Malnutrition) పెచ్చరిల్లిపో తున్నదనే చెప్పొచ్చు. ఇటీవల ప్రపంచ ఆహార నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం పౌష్టికాహార లోపంతో బాధపడేవారి సంఖ్య దాదాపు ఎనభైకోట్లకుపైగా ఉంది.
Read Also : Liquid Ganja: లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం గుట్టురట్టు
2014తో పోలిస్తే ముప్ఫైశాతం అధికం. భారత్లో పౌష్టి కాహారంలో ప్రధానంగా సూక్ష్మ పోషకాహార సమస్య అధికంగా ఉంది. 2018-20 మధ్యకాలంలో ముప్ఫైశాతం, భారత్లో పదహారుశాతం పాకిస్థాన్లో పదిహేడు శాతం ప్రజలు పోషకాహార సమస్యను ఎదురొఒంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో(Malnutrition) బాధపడుతున్న వారిలో మూడోవంతు భారత్ లోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. భారత్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు. 1975లోనే ఆరేళ్లలోపు పిల్లలు, తల్లులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఆనాటి కేంద్ర పాలకులు సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన, పాఠశాలల్లో మధ్యాహ్నభోజన. పథకం తదితర కార్యక్రమాలెన్నో కొనసాగుతున్నాయి. పౌష్టికాహార లోపా న్ని అధిగమించేందుకు పిల్లలకు కోడిగుడ్లు కూడా అంది స్తున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా భారత్ లో పోషకాహారలోపం ఎందరినో పట్టిపీడిస్తున్నది. 2022 లో ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 121 దేశాల్లో 107వ స్థానంలో ఉంది. పౌష్టికాహార లోపం కారణంగానే ఆరోగ్య పరంగా ముఖ్యంగా మహిళలల్లో, చిన్నారుల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో ముప్పై శాతానికి పైగా వయసుకు తగిన ఎత్తు పెరగడం లేదు. మరో పంతొమ్మిది శాతం తగిన బరువు ఉండడం లేదు. ముప్ఫైరెండు శాతం పిల్లలు ఎదుగుదల లోపాన్ని ఎదు ర్కొంటున్నారు. జార్ఖండ్, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, తదితర రాష్ట్రాల్లో పౌష్టికాహార సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇంకోవైపు పదిహేనేళ్ల బాలికల నుండి యాభై యేళ్లలోపు ఉన్న మహిళలలో దాదాపు యాభైఏడు శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఎనభైశాతానికి పైగా సూక్ష్మపోషకాల కొరతను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పౌష్టికాహార లోపా న్ని అధిగమించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పోష కాలు కలిగిన బియ్యాన్ని అందించే కార్యక్రమం కొనసాగు తూనే ఉన్నది. పిల్లల్లో తీవ్రంగా ఉన్న పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించి అమలు చేస్తున్నది. పథకాలు, ఉద్దే శాలు అన్ని సక్రమంగా ఉన్నా సంతృప్తికలిగే విధంగా కన్పిస్తున్నా ఆచరణకు వచ్చేసరికి చాలావరకు లోటుపాట్ల తో మునిగితేలుతున్నాయి. దళారుల ప్రమేయం పెరిగిపో తున్నది. వాస్తవంగా చూసినా భారత్లో గత దశాబ్దకాలంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులకు కొరత లేదు. రికార్డు స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఉచిత పథకాల ద్వారా నిరుపేదలకు చేయూతను అందిస్తూనే ఉన్నాయి. అయినా అందరికి రెండు పూటలా ఆకలి తీర్చుకునేందుకు తిండి గింజలు అందించలేకపోతున్నారు. మరొకపక్క పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవ డంవంటి కారణాలతో అంటువ్యాధులు కేంద్రాలుగా మారు తున్నాయి. మరుగుదొడ్లు లేకపోవడం, కనీస పరిశుభ్రత పాటించకపోవడంతో సమస్యలు విస్తరిస్తున్నాయి. ఇక సమగ్రశిశు అభివృద్ధి పథకం కింద మతాశిశు సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయని ‘కాగ్’ ఏనాటినుంచో హెచ్చరిస్తూనే ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలను, పక్క దారి పడుతున్న పథకాల గూర్చి ఎప్పటికప్పుడు వివరి స్తూనే ఉన్నది. అయినా ఆ నివేదికను పట్టించుకునే వారు లేరు. ఇవి పాలకులకు తెలియంది కాదు. ఇలాంటి పరిస్థి తుల్లో కొత్త పథకాలగూర్చి ఆలోచించకపోయినా ప్రస్తుతం ఉన్న పథకాల్లోని లోపాలను సవరించి పర్యవేక్షణ పెంచితే కొంతవరకైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: