📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Malla Reddy: బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు: మల్లారెడ్డి

Author Icon By Sharanya
Updated: August 10, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. “తాను రాజకీయాల నుంచి తప్పుకోబోవడం లేదని, జీవితాంతం క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని” స్పష్టం చేశారు. రిటైర్మెంట్ గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదని, రాజకీయాలు తనకో జీవనవిధానంగా మారిపోయాయని పేర్కొన్నారు.

Malla Reddy:

“నాకు రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదు”

తన వయస్సు ప్రస్తుతం 73 ఏళ్లు అయినా, ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే కొనసాగుతానని మల్లారెడ్డి (Malla Reddy) తెలిపారు. “జపాన్‌ (Japan) లో ప్రజలకు రిటైర్మెంట్ అనే మాటే ఉండదట నాకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు” అని చెప్పడం విశేషం. కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుతూ, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

వ్యాపార అభివృద్ధి వేరు – రాజకీయ వ్యూహం వేరు

తాను తన విద్యా సంస్థల విస్తరణ (Expansion of educational institutions) పై దృష్టి పెడుతున్నానని మాత్రమే చెప్పారు తప్ప రాజకీయాలను వీడుతున్నట్టు చెప్పలేదని తెలిపారు. “నా వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను రాజకీయాలతో కలిపి చూడకండి” అని ఆయన వివరించారు. విద్యా రంగంలో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులను విస్తరించాలన్నది తన ఆలోచనని తెలిపారు. రాజకీయాలను వదిలేస్తానని అనలేదు. నా మాటలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు” అని ఆయన వివరించారు. తన వ్యాపార ప్రణాళికలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని ఆయన సూచించారు.

పార్టీ మారడం అసంభవం: బీఆర్ఎస్‌నే నా గమ్యం

తాను బీజేపీ లేదా టీడీపీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. “ఇలాంటి ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదు. నేను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు. ఇదే పార్టీలో కొనసాగుతాను” అని ఆయన తేల్చిచెప్పారు. ఈ ప్రకటనతో ఆయన్ను చుట్టుముట్టిన రాజకీయ ఉహాగానాలకు ముగింపు పలికినట్లైంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/guvvala-balaraju-joins-bjp/telangana/528460/

Breaking News BRS MLA BRS party latest news Malla Reddy Malla Reddy Politics Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.