Malla Reddy: బడ్జెట్ సమావేశాల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నా తనదైన పంచ్ డైలాగులతో నవ్వులు పూయించే అలవాటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి మల్లారెడ్డి ఓపెన్‌గా మాట్లాడారు.
Read Also: Hyderabad transport project: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. నగర వాసులకు ఊరట

అసలు సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది నేనే.. ఇప్పుడు నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్‌ను అంటూ మల్లారెడ్డి నవ్వులు పూయించారు. సినిమాల్లో నటించే అవకాశం గురించి స్పందిస్తూ నాకు ఒకరు సినిమా అవకాశం ఇవ్వడం ఏంటి..? నేనే ఒక పెద్ద స్టార్‌ను అని అన్నారు. ఒకవేళ సినిమా చేయాలనిపిస్తే ఎవరి కోసమో వేచి చూడనని, అవసరమైతే తన సినిమాను తానే సొంతంగా తీస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: