📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Malkajgiri: మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌కు కొత్త కళ.. ఉగాదికి ప్రారంభం

Author Icon By Saritha
Updated: February 23, 2026 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Malkajgiri: హైదరాబాద్ మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు 90 శాతం పూర్తయ్యాయని, తుది మెరుగులు దిద్దుతున్నామని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు వెల్లడించారు. ఈ అప్‌గ్రేడెడ్ స్టేషన్‌ను ఉగాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్‌ల మధ్య భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫారమ్‌ నుంచి మరో ప్లాట్‌ఫారమ్‌లపైకి సులభగా రాకపోకలు సాగించేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో పశ్చిమ వైపున ఉన్న టెర్మినల్-2 వద్ద ఇన్, అవుట్ గేట్ల వద్ద అలంకార తోరణాల పనులు పూర్తి చేశారు. తూర్పు వైపు ద్వారం వద్ద కూడా ఇలాంటి పనులే శరవేగంగా చేస్తున్నారు.

Read Also: TG Budget: గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Malkajgiri: New art for Malkajgiri Railway Station.. starts for Ugadi

ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్‌లో పలు కీలక మార్పులు

గౌతమ్‌నగర్ గేట్ రోడ్డు నుంచి బుకింగ్ ఆఫీస్ వరకు కొత్తగా సిమెంట్ కాంక్రీట్ (CC) అప్రోచ్ రోడ్డును నిర్మించారు. ఇది అనుటెక్స్ చౌరస్తా వైపు వెళ్లే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణికులకు ఈ కొత్త రోడ్డు ఒక చక్కని ప్రత్యామ్నాయంగా మారుతుంది. హై మాస్ట్ లైటింగ్ పునాదులు మరియు స్టేషన్ ఆవరణలో కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై స్పందించిన అధికారులకు జెడ్ఆర్‌యూసీసీ సభ్యుడు నూర్ అహ్మద్ అలీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, స్టేషన్ ఆధునీకరణతో పాటు మల్కాజ్‌గిరి మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇక్కడ నిలుపుదల కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగాది పండుగ కానుకగా ఈ స్టేషన్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Amrit Bharat Station Scheme Malkajgiri Railway Station SCR Updates South Central Railway News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.