📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Malkajgiri: మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

Author Icon By Saritha
Updated: February 17, 2026 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Malkajgiri: 2022లో మేడ్చల్ మల్కాజిగిరిలో బంగారు నగల (Gold) కోసం గుడికి వచ్చిన ఓ మహిళను ఆలయ పూజరి దారుణంగా హత్య చేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన దారుణ హత్యకు పాల్పడ్డాడు. నగలు దోచుకొని మృతదేహాన్ని మూడ్రోజుల పాటు గర్భగుడిలోనే ఉంచి ఆ తర్వాత మాయం చేశాడు. తాజాగా జిల్లా కోర్టు హత్య చేసిన పూజారికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా బాల సుబ్బయ్య నగర్‌కు చెందిన అనుమాల మురళీకృష్ణ అలియాస్‌ కిట్టు మల్కాజిగిరిలోని విష్ణుపురిలో నివాసం ఉండేవాడు. స్థానికంగా ఉన్న స్వయంభూ సిద్ధివినాయక గుడిలో పూజారిగా విధులు నిర్వహించేవాడు. అయితే మురళీకృష్ణ చెడు వ్యసనాలకు అలవాటు పడి లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక చోరీకి ప్లాన్ చేశాడు.

విష్ణుపురి ఎక్స్‌టెన్‌షన్‌లో నివాసం ఉంటున్న గోర్తి వెంకట నారాయణ మూర్తి భార్య ఉమాదేవి ప్రతి రోజూ ఆలయానికి వచ్చేది. దీంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై పూజారి మురళీకృష్ణ కన్నుపడింది. ఆ నగలు దొచుకునేందుకు ఛాన్స్ కోసం వేచి చూశాడు. అదే ఏడాది ఏప్రిల్‌ 18 రాత్రి 7.30 గంటలకు ఆలయానికి వచ్చిన ఉమాదేవిని గర్భగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. ఆమె లోపలికి వెళ్లి దేవుడికి దండం పెడుతుండగా ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఐరన్‌ రాడ్డుతో తలపై మోది దారుణంగా హత్య చేశాడు.

Read Also: KCR birthday: కేసీఆర్ జన్మదినోత్సవానికి నేతల శుభాకాంక్షలు

Malkajgiri: Court verdict sentencing priest who killed woman

నగల కోసమే దారుణం

ఉమాదేవి ఒంటిపై ఉన్న బంగారు నగలను కాజేశాడు. మృతదేహాన్ని ఆలయం గర్భగుడిలోనే డ్రమ్ములో కుక్కి దాచిపెడ్డాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు గుడికి తాళాలు వేసి ఉంచాడు. అప్పటికే గుడికి వెళ్లిన ఉమాదేవి కనిపించటం లేదని మృతురాలి భర్త ఫిర్యాదుతో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత శవం దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని పూజారి గుడి వెనుక ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు.

కేసు విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి చెప్పులు ఆలయం బయట లభించడం, పూజారి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అతడ్ని అదుబులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నగల కోసమే ఉమాదేవిని హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతనిపై పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపారు. తాజాగా వాదనలు విన్న న్యాయస్థానం అతడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Gold Jewelry Theft Latest News in Telugu Medchal-Malkajgiri Crime Priest Murder Case Telugu News Temple Murder 2022 Umadevi Murder Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.