హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ గురుకులాలన్నింటికీ ఒకే టైం టేబుల్ ఉండాలని కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క
కొమురయ్య అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ మంగళవారం బిసి, ఎస్సీ గురుకుల సొసైటీల కార్యదర్శులకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లోని టైం టేబుల్ను పునఃసమీక్షిస్తూ నూతన టైం టేబుల్ను అమలు చేయాలని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య (Malka Komuraiah) మంగళవారం మసాబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన గురుకులాల సెక్రటరీ సైదులు, సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షినిని కలిసి విజప్తి చేసినట్టు తెలిపారు.
సానుకూలంగా స్పందిస్తూ
ఎమ్మెల్సీ మాట్లాడుతూ గురుకులాల సమయ సారిని గూర్చి గతంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శిని కలిసి విజప్తి చేసిన సందర్భంలో అన్ని గురుకులాల (Gurukula) కార్యదర్శుల పరిశీలనకు పంపించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, ఇదే విషయాన్ని ట్రైబ్ చైర్మన్ సైదులు, సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ అలుగు వర్షిని దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిపారు. వారు సానుకూలంగా స్పందిస్తూ తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేసినట్టు ఎమ్మెల్సీ చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకులాలలో కామన్ స్టాఫ్ ప్యాట్రన్ (Common Staff Pattern) అమలు చేయాలని, కామన్ ప్రమోషన్ ఛానెల్ ఉండేలా చూడాలని ప్రాతినిధ్యం చేయగా అందుకు ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ సానుకులంగా స్పందించినట్టు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు.
మల్క కొమురయ్య ఎవరు?
మల్క కొమురయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC). ఆయన కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మల్క కొమురయ్య విద్యా రంగంలో ఎలాంటి కృషి చేస్తున్నారు?
విద్యా వ్యవస్థలో సమానత్వం కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం, గురుకుల పాఠశాలల అభివృద్ధి కోసం మల్క కొమురయ్య నిరంతరం కృషి చేస్తున్నారు. ఇటీవల అన్ని గురుకులాలకు ఒకే టైం టేబుల్ అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: R. Krishnaiah: ఫీజు బకాయిలు చెల్లించండి