BRS re entry : Gudam Mahipal Reddy తిరిగి సొంత గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే తాజా రాజకీయ పరిణామాలు ‘అవును’ అనే సమాధానాన్నే ఇస్తున్నాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే అయిన గూడెం మహిపాల్ రెడ్డి, త్వరలోనే Bharat Rashtra Samithi లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చేరికకు బీఆర్ఎస్ సీనియర్ నేత T. Harish Rao ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మహిపాల్ రెడ్డి గత మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. గత ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆయన హ్యాట్రిక్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. అయితే ఎన్నికల అనంతరం, సుమారు ఏడు నెలలకే ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నుంచే వర్గపోరు మహిపాల్ (BRS re entry) రెడ్డికి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఆయనపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కాట శ్రీనివాస్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ మద్దతుతో యాక్టివ్‌గా ఉండటంతో రాజకీయంగా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ మారి తప్పు చేశానని మహిపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Read Also: India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?
ఈ క్రమంలో మళ్లీ బీఆర్ఎస్‌లోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆయన వర్గాలు చెబుతున్నాయి. K. Chandrashekar Rao పై తనకు అభిమానముందని, అందుకే క్యాంప్ ఆఫీసులో ఆయన ఫొటో తీసేయలేదని మహిపాల్ రెడ్డి సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.
కేటీఆర్ నిర్ణయమే కీలకం?
అయితే పార్టీని వీడిన ఎమ్మెల్యేలను తిరిగి తీసుకోబోమని K. T. Rama Rao గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను కలిసి తప్పు జరిగిందని ఒప్పుకునేందుకు మహిపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈరోజే కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యే అవకాశముందని చర్చ జరుగుతోంది. కేటీఆర్ సమ్మతిస్తే, కేసీఆర్ అపాయింట్‌మెంట్ దక్కే అవకాశం ఉందని, లేదంటే బీఆర్ఎస్‌లోకి రీ-ఎంట్రీ కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: