📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BJP – BRS : కెసిఆర్, హరీశ్ తో ఈటల చేతులు కలుపుతున్నారు – TPCC చీఫ్

Author Icon By Sudheer
Updated: May 30, 2025 • 8:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతున్న తరుణంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ (Mahesh Kumar) బీజేపీ నేత ఈటల రాజేందర్‌ (Etela Rajender)పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం స్కామ్ కేసు నుంచి బయటపడేందుకు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులతో కలిసి ఈటల రాజేందర్ చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. “హరీశ్ రావును కలిసి, తర్వాత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈటల నిజంగా బీజేపీలో ఉన్నారా? లేక బీఆర్ఎస్‌లోనా?” అని మహేశ్ ప్రశ్నించారు.

BJP-BRS మధ్య దోస్తీ నాటకం – కవితే సాక్ష్యం

“బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందని ఇటీవలే కవిత వెల్లడించారు. ఇదే విషయాన్ని మేము ఎన్నో రోజులుగా చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు ఆమె నోటి ద్వారా నిజం బయటపడింది,” అని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఈ దోస్తీపై ఇప్పటికైనా ప్రజలు గమనించాలని, పార్టీలు లేని డ్రామాలపై విశ్వాసం పెట్టొద్దని సూచించారు.

బండి సంజయ్ తొలగింపుకి దొంగ మైత్రి కారణం

బీజేపీ నేత బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో నుంచి తొలగించడానికీ ఈ మైత్రేనే కారణమని మహేశ్ ఆరోపించారు. “బండి సంజయ్ ఈ దోస్తీకి అడ్డుగా ఉన్నారు. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించారు. ప్రజల మద్దతుతో వచ్చినవారు ఇలా కుట్రలకు బలి అవడం బాధాకరం,” అని అన్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే సంకేతాలు ఈ ఆరోపణలతో స్పష్టమవుతున్నాయి.

Read Also : Kavitha Issue : కెసిఆర్ దగ్గర ఉన్న దెయ్యాలేవో కవిత చెప్పాలి – పొంగులేటి డిమాండ్

Etela Rajender Google News in Telugu harish rao Mahesh kumar Goud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.